Hyderabad: మీ పిల్లలు చాక్లెట్లు, బిస్కెట్లు తింటున్నారా.. తస్మాత జాగ్రత్త.. కాలంచెల్లిన..

Hyderabad: పిల్లలు తినే చాక్లెట్లు, బిస్కెట్లను రీసైక్లింగ్ చేస్తున్న నకిలీ గ్యాంగ్‌ను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2023-03-01 04:52 GMT

Hyderabad: మీ పిల్లలు చాక్లెట్లు, బిస్కెట్లు తింటున్నారా.. తస్మాత జాగ్రత్త.. కాలంచెల్లిన.. 

Hyderabad: పిల్లలు తినే చాక్లెట్లు, బిస్కెట్లను రీసైక్లింగ్ చేస్తున్న నకిలీ గ్యాంగ్‌ను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాలం చెల్లిన చాక్లెట్లు, బిస్కెట్లకు కొత్త లేబుల్‌ వేసి మార్కెట్‌లోకి పంపిణీ చేస్తున్నట్లు గుర్తించారు. మేడిపల్లి కేంద్రంగా గోదాములపై పోలీసులు దాడి చేయడంతో ఈ దందా బయటపడింది. లాలీపాప్, సోప్స్‌, పర్ఫ్యూమ్స్ వంటి 300 రకాల కాలం చెల్లిన బ్రాండ్ల వస్తువులను తీసుకుని రీసైక్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు కోఠీలోని హరిహంత్ కార్పొరేషన్ కార్యాలయంలో సోదాలు జరిపి..కోట్ల రూపాయల విలువ చేసే ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 300 రకాల వస్తువులను రీసైక్లింగ్ చేసి కొత్త లేబుల్స్, స్టిక్కర్స్ వేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని జైలుకు తరలించారు.

Tags:    

Similar News