HMDA Office Shifted : హెచ్ఎండీఏ కార్యాలయం మార్చబడింది

HMDA Office Shifted : ఇప్పటి వరకు తార్నాకలోని డిస్ట్రిక్ కమర్షియల్ కాంప్లెక్స్‌లో కార్యకలాపాలు కొనసాగించిన హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫీసుని అధికారులు అమీర్‌పేటకు మార్చారు.

Update: 2020-08-03 11:24 GMT
తార్నాకలోని హెచ్ఎండీఏ ఆఫీసు

HMDA Office Shifted : ఇప్పటి వరకు తార్నాకలోని డిస్ట్రిక్ కమర్షియల్ కాంప్లెక్స్‌లో కార్యకలాపాలు కొనసాగించిన హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫీసుని అధికారులు అమీర్‌పేటకు మార్చారు. హెచ్ఎండీలోని అన్ని విభాగాల కార్యకలాపాలు నేటి (ఆగష్టు 3) నుంచి అమీర్‌పేటలో ప్రారంభించారు. ఇక నుంచి స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లోని రెండు, నాలుగు, ఐదు, ఏడో అంతస్థుల్లో హెచ్ఎండీ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ మాట్లాడుతూ అథారిటీ ఆఫీసు అడ్రస్ మైత్రివనం పక్కనున్న స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌కు మారిన విషయాన్ని ప్రజలు గమనించాలని తెలిపారు. హెచ్ఎండీఏ మెయిల్ ఐడీ, వెబ్‌సైట్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా అకౌంట్లలో ఎలాంటి మార్పులు ఉండవని ఆయన స్పష్టం చేసారు.

నిన్నటి వరకు తార్నాకలో ఉన్న హెచ్ఎండీఏ ప్రాంగణం అందులో విధులు నిర్వహించే వారికి, వచ్చి పోయే వారికి  దూరంగా ఉందని, రాకపోకలకు అసౌకర్యంగా ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా ఈ కార్యాలయం దూరంగా ఉండడంతో వివిధ విభాగాల మధ్య సమన్వయం కూడా కుదరడం లేదన్నారు. ఇక ఈ సమయంలోనే స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌లోని చాలా భాగాలు ఖాళీగా ఉండటంతో హెచ్ఎండీఏ హెడ్ కార్యాలయాన్ని అమీర్‌పేటకు తరలించారన్నారు. స్వర్ణ జయంతి కాంప్లెక్స్ ఆధునికీకరణకు రూ.8 కోట్లు ఖర్చయ్యాయని సమాచారం.

హెచ్ఎండీఏ ఏర్పాటైన 1975లో నాటి నుంచి 2008 వరకు బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో కార్యాలయ కార్యకలాపాలు నిర్వహించారు. 2008లో ప్యాలెస్‌ను అమెరికా కన్సులేట్‌కు అప్పగించారు. అనంతరం మారేడ్‌పల్లిలోని మున్సిపల్ కార్యాలయం భవనంలోకి మార్చారు. 2010లో తార్నాకకు కార్యాలయాన్ని మార్చారు.

Tags:    

Similar News