Haritha Haram Program: అధికారులకు ఉపయోగపడుతున్న హరితహారం నిధులు!

Update: 2020-07-21 11:04 GMT

Haritha Haram Program: సర్కార్‌ మానసపుత్రిక పథకం అలాంటి మానస పుత్రిక పథకానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారు. నాటిన హరితహారం మొక్కలు, పచ్చని చెట్లతో కళకళలాడాల్సిన ప్రాంతం బీడు భూములను తలపిస్తున్నాయి. కాని మొక్కలు మొలవకున్నా అధికారులకు మాత్రం ఈ పథకం బాగానే ఉపయోగపడుతోందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. సంరక్షణ చేస్తున్నామని నిధులు మింగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల ధనదాహాన్ని తీర్చుతున్న హరితహారంపై హెచ్‌హెంటీవీ స్పెషల్‌ స్టోరీ.

హరితహారం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హరితహారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో 2019-20 సంవత్సరంలో లక్షల మొక్కలు నాటారు. ఒక్క బోథ్‌ మండలంలోనే 10వేల 749 మొక్కలు నాటించారు. వీటిని సంరక్షించడానికి ఎనిమిది మంది వాచ్‌‌మెన్‌లను కూడా నియమించారు. ఒక్కో గ్రామ పంచాయతీలో వేల మొక్కలు నాటారు. కానీ నాటిన మొక్కలు ఒక్కటి కూడా కన్పించడం లేదనే విమర్శలున్నాయి. వేల మొక్కలు నాటిన ప్రాంతంలో వందల మొక్కలు కూడా బ్రతికినట్లుగా కన్పించడం లేదంటున్నారు. మొక్కలను సంరక్షించకపోయినా నిధులు మింగుతున్న విషయం సమాచార చట్టం కింద సేకరించిన వాటిలో అధికారుల అవినీతి బట్టబయలైనట్లు సమాచారం. మొక్కలకు కాపలా పేరుతో వాచ్‌మెన్‌లను ఏర్పాటు చేశారు. పైగా వాటిని నీళ్లతో రక్షిస్తున్నట్లుగా నిధులు మింగిన విషయం సమాచార హక్కు చట్టం క్రింద బోథ్‌ పౌర సమాజం.. సేకరించినట్లుగా తెలుస్తోంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హరితహారం పథకంలో భాగంగా మొక్కలు బ్రతకకున్నా వాటి పేరుతో పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. కుమ్రంబీమ్‌ జిల్లా తిర్యాని, కెరమెరి, సిర్పూర్‌యు, లింగపూర్‌, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి, నార్నూర్‌, ఉట్నూర్‌ ప్రాంతాలలో మొక్కలు నాటిన జాడేలేదు. కానీ పెంపకం, సంరక్షణ పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నట్లు ఆరోపణలున్నాయి. మంచిర్యాల జిల్లాలో నెన్నెల, కాశీపేట, తాండూరు, వేమన్‌పల్లి, నిర్మల్‌ జిల్లా కడెం, ఖానాపూర్‌, దస్తురాబాద్‌ మండలాల్లో హరితహారంలో నాటిన మొక్కలు పదిశాతం కూడా లేవు. సర్కార్‌ ప్రతిష్టాత్మకమైన పథకానికి తూట్లు పొడుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Full View


Tags:    

Similar News