Corruption in Adilabad ICDS: పశువుల దాణాగా మారుతున్నబాలామృతం

Corruption in Adilabad ICDS: పశువుల దాణాగా మారుతున్నబాలామృతం
x
Highlights

అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలు ఎదగడానికి ఇచ్చే పౌష్టికాహారం బాలామృతం. అలాంటి పోషకాహారం పశువులకు దాణాగా మారుతోంది. పిల్లల పౌష్టికాహారాన్ని కూడా...

అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలు ఎదగడానికి ఇచ్చే పౌష్టికాహారం బాలామృతం. అలాంటి పోషకాహారం పశువులకు దాణాగా మారుతోంది. పిల్లల పౌష్టికాహారాన్ని కూడా రాబందుల్లా తన్నుకుపోతున్నది ఎవరు? దీని వెనుక ఎవరి హస్తం ఉంది? అసలు అంగన్ వాడీ కేంద్రాల్లో ఏం జరుగుతోంది hmtv స్పెషల్ రిపోర్ట్

ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బాలామృతం బస్తాలు పక్కదారి పడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని దేవాపూర్ గ్రామంలో బాలామృతం బస్తాలను ఐసీడీఎస్ ఉద్యోగులు పశువుల డైరీకి అమ్మారు. పశువుల దాణా కోసం బాలామృతాన్ని కొనుగోలు చేశానని ఒప్పుకున్నాడు డైరీ యాజమాని యూసుఫ్. పోలీసులు అతడి దగ్గర నుంచి 25 బాలామృతం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ఐసీడీఎస్ తాత్కాలిక ఉద్యోగులు, డైరీ యాజమానిపై కేసు నమోదు చేశారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో అంగన్ వాడీ కేంద్రాలకు బాలామృతం పంపిణీ కావడం లేదు. ఉట్నూరు, ఇంద్రవెల్లి, నార్నూర్, తిర్యాని, కౌటలా, బెజ్జూర్‌ మండలాల్లో బాలామృతం మూడు, నాలుగు, నెలలకు ఒక్కసారి పంపిణీ అవుతుంది. అయితే కొంతమంది ఉద్యోగులు వీటిని పంపిణీ చేయకుండా పశువుల దాణాగా అమ్ముకుంటున్నారని తెలుస్తోంది. ఈ దందాలో ఉన్నత అధికారుల పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories