Harish Rao: రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు.. నల్లమల పిల్లి..
Harish Rao: తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డి పై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. రేవంత్ నల్లమల పులి కాదు, నల్లమల పిల్లి అని సెటైర్లు వేశారు.
Harish Rao: రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు.. నల్లమల పిల్లి..
Harish Rao: తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డి పై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. రేవంత్ నల్లమల పులి కాదు, నల్లమల పిల్లి అని సెటైర్లు వేశారు. కింద గోదావరి నీళ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతే, పైన కృష్ణా నీళ్లు కర్ణాటక తీసుకుపోతే మన పరిస్థితి ఏమవుతుందో రేవంత్ రెడ్డి ఆలోచించడం లేదని విమర్శించారు.
రేవంత్ ఇటీవల కర్ణాటక వెళ్లినప్పుడు అక్కడి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్‌లను కలసి ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు విషయం మాట్లాడతాడని అనుకున్నా, ఒక మాట కూడా మాట్లాడలేదని అన్నారు. రాహుల్ గాంధీకి దగ్గరగా ఉన్నా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఫోన్ కూడా చేయలేకపోతున్నాడని హరీశ్ రావు మండిపడ్డారు.
రేవంత్ ఢిల్లీకి బ్యాగులు మోయడం మాత్రమే కాదు, తెలంగాణ బాగోగుల గురించి కూడా పట్టించుకోవాలని సూచించారు. కర్ణాటక 112 టీఎంసీలు, మహారాష్ట్ర 74 టీఎంసీలు నీళ్లు ఆపేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాలన్నారు. నువ్వు నిజంగా నల్లమల పులివైతే మాట్లాడి చూపించు, కానీ పిల్లివి, ఎలుకవు కాబట్టి నిశ్శబ్దంగా ఉన్నావని హరీశ్ రావు ఘాటుగా వ్యాఖ్యానించారు.