NRI Death: అమెరికాలో విషాదం వర్క్ ఫ్రమ్ హోం చేస్తుండగా తెలంగాణ వాసి మృతి

NRI Death: అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తెలంగాణ వాసి హర్షవర్ధన్ రెడ్డి వర్క్ ఫ్రమ్ హోం చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబంలో విషాదం.

Update: 2026-01-28 07:58 GMT

NRI Death: అమెరికాలో విషాదం వర్క్ ఫ్రమ్ హోం చేస్తుండగా తెలంగాణ వాసి మృతి

అమెరికాలో తెలంగాణ వాసి మృతి

NRI Death: అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తెలంగాణ వాసి గుండెపోటుతో మృతి చెందాడు. వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందినట్లు సమాచారం.

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన హర్షవర్ధన్ రెడ్డి (45) గత పదేళ్లుగా అమెరికాలోని ఫ్లోరిడాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. హర్షవర్ధన్ రెడ్డి తండ్రి సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం బొల్లారం గ్రామ సర్పంచ్‌గా సేవలందిస్తున్నారు.

ఈ ఘటనతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అమెరికాలోని స్నేహితులు, బంధువులు కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

Tags:    

Similar News