Palamuru: పాలమూరు కార్పొరేషన్ మేయర్ రేసు: బీసీ మహిళ రిజర్వేషన్‌తో హీట్

Palamuru: పాలమూరు కార్పొరేషన్‌లో పొలిటికల్ హీట్ మేయర్ సీటు దక్కేది ఎవరికి.?

Update: 2026-01-27 07:37 GMT

Palamuru: పాలమూరు కార్పొరేషన్ మేయర్ రేసు: బీసీ మహిళ రిజర్వేషన్‌తో హీట్

Palamuru: కొత్త కార్పొరేషన్... మొదటి మేయర్.... బీసీ మహిళకు రిజర్వేషన్... సతులను బరిలో నిలుపుతున్న పతులు.. పావులు కదుపుతున్న నేతలు... పాలమూరులో పాగా వేసేది ఎవరు..? ఆ ఐదుగురి ఆశలపై రిజర్వేషన్ నీళ్లు చల్లిందా...?


మహబూబ్‌ నగర్‌ కార్పొరేషన్‌లో రాజకీయం హీట్ ఎక్కింది. మేయర్ పదవి బీసీ మహిళకు రిజర్వ్‌ కావడంతో నైరాశ్యం ఏర్పడింది. బీసీ మహిళకు కేటాయించడంలో కొందరు పావులు కదిపారనే ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ నుంచి ఐదుగురు మేయర్‌ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. వారిని పోటీ నుంచి తప్పించడంలో భాగంగానే బీసీ మహిళకు రిజర్వేషన్ చేశారని తెలుస్తుంది. మేయర్‌ పదవిపై కన్నేసిన వారు తమ సతులను బరిలో దింపేందుకు దారులు వెతుక్కుంటున్నారు. బీసీ మహిళకు రిజర్వేషన్ కొంతమంది ఆశలపై నీళ్లు చల్లగా మరికొందరు సంతోషంతో కార్యచరణకు రెడీ అయ్యారు. రిజర్వేషన్ ఖరారైన తర్వాత కూడా పోటీకి ఏమాత్రం తగ్గడం లేదు.


ప్రధానంగా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ భార్య ప్రసన్న, కాంగ్రెస్ నాయకుడు చల్వగాలి రాఘవేందర్ రాజు భార్య వసంత, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ భార్య స్వప్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది ఎన్.పి. వెంకటేష్ కూతురు నేహా శ్రీ, తో పాటు మరికొందరు కూడా మేయర్ రేసులోకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ భార్య ప్రసన్నకు గతంలో కౌన్సిలర్‌గా చేసిన అనుభవం ఉంది. అలాగే ఆనంద్ కుమార్ గౌడ్ కూడా... గత మున్సిపాలిటీ పాలనలో ఏడాదిన్నరేళ్లు మున్సిపల్ చైర్మన్‌గా పనిచేయడం, పట్టణంలోని కౌన్సిలర్లతో ఉన్న సత్సంబంధాలు, మున్సిపాలిటీలో ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం ఆనంద్ గౌడ్ కు కలిసి వచ్చే అంశంగా ఉందంటున్నారు. ఇక ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన చలువగాలి రాఘవేందర్ రాజు భార్య వసంత... ప్రస్తుతం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. వారి కుటుంబంలో ఇద్దరు వదినల్లో ఇప్పటికే ఒకరు మున్సిపల్ చైర్‌పర్సన్ గా... మరొకరు కౌన్సిలర్‌గా పనిచేయడం వల్ల మున్సిపల్ రాజకీయాలపై మంచి పట్టు ఆ కుటుంబానికి ఉంది. ఇది రాఘవేందర్ రాజు సతీమణి వసంతకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


ఇక మూడో వ్వక్తి మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ కూడా తన భార్య స్వప్నను తొలి మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలనే లక్ష్యంతో రాజకీయ పావులు కదుపుతున్నారని సమాచారం. అయితే లక్ష్మణ్ యాదవ్ ప్రస్తుతం ముడా చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యావంతురాలైన ఆయన సతీమణి స్వప్న ను మేయర్ బరిలో నిలపాలని ఆశిస్తున్నారు. మేయర్ కాకపోయిన తన డివిజన్ లో కార్పొరేటర్ గా నైనా పోటీ చేయించుకుని గెలిపించుకున్న తర్వాత పరిస్థితులను బట్టి మేయర్ పదవికి పావులు కదపొచ్చన్న భావనలో లక్ష్మణ్ యాదవ్ ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు సీనియర్ నాయకులు, న్యాయవాది ఎన్.పి. వెంకటేష్ తన కూతురు నేహా శ్రీని మేయర్‌గా చూడాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు ఆయన కూడా తన ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మహబూబ్ నగర్ కార్పొరేషన్ తొలి మేయర్ పీఠం కోసం అధికార పార్టీలోనే పోటీ హోరాహోరీగా మారింది. చివరకు పార్టీ అధిష్టానం ఎవరికీ అవకాశం ఇస్తుందో, ఎవరి వ్యూహం ఫలిస్తుందో ఆసక్తికరంగా మారింది.


అయితే అధికార కాంగ్రెస్ పార్టీలో మేయర్ పదవి కోసం పోటీ అధికంగా ఉంది కానీ మిగతా బిఆర్ఎస్, బిజెపిలో మేయర్ అభ్యర్థి ఎవరు అనే అన్న ప్రశ్న చర్చగానే మిగిలిపోయింది. బీఆర్ఎస్‌ నుంచి కోరమోని వనజ పేరు మాత్రమే తెరపైకి వస్తుంది. ఇక బిజెపిలో మాత్రం మేయర్ అభ్యర్థి ఎవరు అన్న చర్చ చర్చగానే మిగిలిపోయింది. బీఆర్ఎస్, బిజెపి పార్టీల నుంచి ఎవరు మేయర్ పదవి అభ్యర్థి అన్నది పక్కన పెడితే అధికార కాంగ్రెస్‌లో మాత్రం మేయర్ పదవి కోసం పార్టీ నాలుగు ముక్కలుగా చీలిపోయిందన్న టాక్‍ కొనసాగుతుంది. అధికార కాంగ్రెస్, పదేళ్ళు పాలించిన బీఆర్ఎస్, ఇటు ఒక్కసారైనా అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న బిజెపిల నుంచి ఎవరు మేయర్ పదవి దక్కించుకుంటారో...? ఎవరు మేయర్ కుర్చీలో కూర్చుంటారో...? వేచి చూడాల్సిందే....?

Tags:    

Similar News