Vakiti Srihari: మంత్రి శ్రీహరికి త్రుటిలో తప్పిన ప్రమాదం.. జెండా ఆవిష్కరిస్తుండగా విరిగిపడ్డ కర్ర!
Vakiti Srihari: నారాయణపేట జిల్లా మక్తల్‌లో గణతంత్ర వేడుకల్లో ప్రమాదం. జాతీయ జెండా ఆవిష్కరిస్తుండగా విరిగిపడ్డ కర్ర. మంత్రి వాకిటి శ్రీహరికి త్రుటిలో తప్పిన ముప్పు. అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు.
Vakiti Srihari: మంత్రి శ్రీహరికి త్రుటిలో తప్పిన ప్రమాదం.. జెండా ఆవిష్కరిస్తుండగా విరిగిపడ్డ కర్ర!
Vakiti Srihari: జిల్లాలోని మక్తల్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ పెను ప్రమాదం తప్పింది. రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి జాతీయ జెండాను ఆవిష్కరిస్తుండగా ఒక్కసారిగా అపశ్రుతి చోటుచేసుకుంది. జెండా ఎగురవేసే క్రమంలో కర్ర విరిగి కిందపడటంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
అసలేం జరిగిందంటే?
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మక్తల్ తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీహరి, జెండా ఎగురవేసేందుకు తాడును లాగారు. అయితే, ఆ బరువును తట్టుకోలేకపోయిన జెండా కర్ర మధ్యలోకి విరిగి నేరుగా మంత్రి వైపు పడింది. మంత్రి వెంటనే అప్రమత్తమై పక్కకు తప్పుకోవడంతో ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది.
ఒకరికి గాయాలు - అధికారుల నిర్లక్ష్యం:
దురదృష్టవశాత్తూ, విరిగిన కర్ర ముక్క అక్కడే ఉన్న మరో వ్యక్తిపై పడటంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు, భద్రతా సిబ్బంది బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మంత్రి పాల్గొనే అధికారిక కార్యక్రమంలో నాణ్యత లేని, బలహీనమైన కర్రను ఉపయోగించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమర్శలు వస్తున్నాయి.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. వేడుకల వేళ ఇలాంటి ఘటన జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.