Mahesh Kumar Goud: రాజకీయ కక్ష ఉంటే అప్పుడే అరెస్టులు జరిగేవి
Mahesh Kumar Goud: రాజ్యాంగం ప్రకారం తమ ప్రభుత్వం నడుస్తోందని చిట్ చాట్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్ అన్నారు.
Mahesh Kumar Goud: రాజ్యాంగం ప్రకారం తమ ప్రభుత్వం నడుస్తోందని చిట్ చాట్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్ అన్నారు. అందుకే గత ప్రభుత్వంలో జరిగిన అన్నింటిపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. దీనిని రాజకీయ కక్ష్య అనుకుంటే తమ ప్రభుత్వం ఏర్పడ్డ రోజు నుంచే అరెస్ట్ చేసే వాళ్లమన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా తీవ్రమైన నేరమని.. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణను బీఆర్ఎస్ నేతలు ఎలా వింటారని ప్రశ్నించారు.
గతంలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆయన ఆరోపించారు. మన్రేగా పేరు మార్పుపై ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 1 వరకు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే గ్రామసభల్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ పాల్గొననున్నారని టీపీసీసీ చీఫ్ తెలిపారు.