Hyderabad Police : మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌లో తూటాల వర్షం.. డ్ర*గ్స్ మత్తులో నేతలు!
Hyderabad Police : మొయినాబాద్ డ్ర*గ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి కొకైన్ పాజిటివ్ రాగా, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు నెగిటివ్ వచ్చింది. పోలీసులపై కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Pilot Rohit Reddy
Hyderabad Police :హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ ప్రాంతం ఆదివారం తెల్లవారుజామున తుపాకుల మోతతో దద్దరిల్లింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. డ్ర*గ్స్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులపైకి తూటాలు పేలడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ వ్యవహారంలో రాజకీయ ప్రముఖులు, విదేశీ డ్ర*గ్స్ నెట్‌వర్క్ లింకులు ఉండటంతో పోలీసులు ఎంక్వైరీని ముమ్మరం చేశారు.
అసలేం జరిగిందంటే.. రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో కొకైన్ పార్టీ ఏర్పాటు చేశారని తెలుసుకున్న ఈగల్ టీమ్ మెరుపు దాడి చేసింది. పోలీసులు లోపలికి వస్తున్న క్రమంలో ఢిల్లీకి చెందిన నమిత్ మిశ్రా అనే వ్యక్తి వారిని భయపెట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పులకు వాడింది రితేష్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన లైసెన్స్డ్ గన్ అని పోలీసులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఎస్వోటీ (SOT) పోలీసులు ఫామ్‌హౌస్‌ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి 9 మంది పురుషులను, ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 గ్రాముల కొకైన్, రివాల్వర్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కూడా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. అయితే, పోలీసుల పరీక్షల్లో ఎంపీకి డ్ర*గ్స్ నెగిటివ్ వచ్చింది. కానీ, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా ఐదుగురికి కొకైన్ పాజిటివ్ అని తేలడం సంచలనంగా మారింది. రోహిత్ రెడ్డితో పాటు నమిత్ మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిలు డ్ర*గ్స్ తీసుకున్నట్లు రిపోర్టులు స్పష్టం చేశాయి. వీరందరినీ ఎర్రగడ్డ ఆస్పత్రిలో పరీక్షల అనంతరం మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించి ఎంక్వైరీ చేస్తున్నారు.
ఈ పార్టీకి అసలు డ్ర*గ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డే ఈ పార్టీని ఆర్గనైజ్ చేశారా? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. పోలీసులపై కాల్పులు జరిపినందుకు గాను నమిత్ శర్మపై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. రాజకీయ నేతలు, బడా బాబులు ఇలా డ్ర*గ్స్ మత్తులో తూగుతూ, పోలీసులపైకే గన్ ఎత్తడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు? వెనుక ఉన్న డ్ర*గ్ మాఫియా ఏంటి? అనేది త్వరలోనే తేలనుంది.