వేసవిలో నీటి కష్టాలు రావద్దు.. అధికారులకు జుక్కల్ ఎమ్మెల్యే తోట సీరియస్ వార్నింగ్!

Jukkal: వేసవి కాలం దృష్ట్యా నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అధికారులను ఆదేశించారు.

Update: 2026-03-14 09:49 GMT

వేసవిలో నీటి కష్టాలు రావద్దు.. అధికారులకు జుక్కల్ ఎమ్మెల్యే తోట సీరియస్ వార్నింగ్!

జుక్కల్ (కామారెడ్డి): వేసవి కాలం దృష్ట్యా నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అధికారులను ఆదేశించారు. శనివారం జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్‌డబ్ల్యూఎస్ (RWS) అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో తాగునీటి సరఫరా తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.

యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు

నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పైపులైన్ల మరమ్మత్తులు, ఇతర నిర్వహణ పనులను తక్షణమే పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఎక్కడా నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. మోటార్ల సమస్యలు వంటి చిన్న చిన్న లోపాలను కూడా వెంటనే గుర్తించి పరిష్కరించాలని, పనుల్లో జాప్యం జరిగితే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.

అధికారుల నిరంతర పర్యవేక్షణ

ప్రతి గ్రామానికి తాగునీరు సక్రమంగా అందుతుందో లేదో సంబంధిత ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. తాగునీటి సరఫరాపై ప్రజల నుండి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఒకవేళ ఎక్కడైనా నీటి సమస్య ఉత్పన్నమైతే వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ డిప్యూటీ ఇంజినీర్ కౌశిక్, ఏఈలు రాచప్ప, నయీం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News