Moinabad Drug Raid: ఫామ్ హౌస్ లో డ్ర*గ్స్ కలకలం.. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నాయకుల ఫైర్!

Moinabad Drug Raid: మొయినాబాద్ లో డ్ర*గ్స్ రైడ్ ఘటన పై కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2026-03-15 07:50 GMT

oinabad Drug Raid

Moinabad Drug Raid: మోయినాబాద్ లో శనివారం రాత్రి పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో డ్ర*గ్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. పోలీసులు జరిపిన దాడుల్లో అక్కడ ఏపీకి చెందిన ఎంపీతో పాటు, పలువురు కొకైన్ తీసుకున్నట్టు తీసుకున్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది. ఈ ఘటన రాజకీయంగా కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లోనే ఘటన జరగడం.. పైగా అక్కడ పోలీసులపై కాల్పులు చోటుచేసుకోవడంతో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈరోజు గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఎవరెవరు ఏమన్నారంటే..

 బి మ‌నోహార్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే..

  • మోహినాబాద్ పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్ర‌గ్స్ తీసుకుంటు దొరికాడు. ఆయ‌న తో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులున్నారు.
  • ఢిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యే న‌మీత్ శ‌ర్శ పైలెట్ రోహిత్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడు.
  • హైదరాబాద్ ను డ్ర‌గ్స్ మాఫియాకు అడ్డ‌గా ప‌దేళ్ల‌లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం మార్చింది..
  • డ్ర‌గ్స్ ర‌హిత తెలంగాణ కోసం మా సీఎం రేవంత్ రెడ్డి నిద్ర‌లేని రాత్రులు గడుపుతున్నారు. మా సీఎం రేవంత్ రెడ్డి డ్ర‌గ్స్ ర‌హిత తెలంగాణ కోసం ఈగ‌ల్ టీం ను ఏర్పాటు చేశారు.
  • ప‌దేళ్ల పాటు ఆడిదే ఆట‌ పాడిందే పాట గా బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో వ్య‌వ‌హారించారు..
  • పైలెట్ రోహిత్ రెడ్డి డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు తేలింది. బీఆర్ఎస్ నాయ‌కులు దీనికి స‌మాధానం చెప్పాలి. డ్ర‌గ్స్ అంటే ఏమిటో నాకు తెలియ‌ద‌ని గ‌తంలో కేటీఆర్ అన్నారు.
  • వేరే రాష్ట్రాల నుంచి డ్ర‌గ్స్ తీసుకువ‌చ్చి ఇక్క‌డ హంగామా చేశారు. రాత్రి జ‌రిగింది చిన్న పార్టీ కాదు.. డ్ర‌గ్స్ మాఫియా.. పెద్ద రాకెట్ న‌డుస్తోంది. డ్ర‌గ్స్ రాకెట్ లో ఉన్న వాళ్ల పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తాయి..
  • కూక‌టివేళ్ల‌తో డ్ర‌గ్స్ మాఫియాను నిర్మూలించాలి. తెలంగాణ యువ‌త‌ను చెడ‌గొట్ట‌డానికి డ్ర‌గ్స్ మాఫియా ప‌నిచేస్తోంది. తాండూరు ప్ర‌జ‌లు ఇలాంటి వ్య‌క్తి వెంట ఉన్నామా అని త‌లదించుకుంటున్నారు.
  • స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునేలా బీఆర్ఎస్ నాయ‌కుల ప్ర‌వ‌ర్తన ఉంది. ఈగ‌ల్ టీం ఈ డ్ర‌గ్స్ ముఠా వెనుక ఉన్న వాళ్ల‌ని బ‌య‌ట‌కు లాగుతుంది.

ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత

  • పైలెట్ రోహిత్ రెడ్డి కేటిఆర్ తో కలిసి హైదరాబాద్ ను డ్ర*గ్స్కు అడ్డాగా మార్చాలని చూస్తున్నారు.
  • గతంలో పామ్ హౌజ్ లో దొరికన 6గురు ఎమ్మెల్యేలు కడిగిన ముత్యాలు అని కేటిఆర్ అన్నారు. మరి కడిగిన ముత్యం అయితే ఇప్పుడు రోహిత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ అయితడు
  • బెంగుళూరు లో డ్ర*గ్స్దందాలో రోహిత్ రెడ్డి తో పాటు కేటిఆర్ కు సంబంధాలు ఉన్నాయి. రోహిత్ రెడ్డి తాండూరు ఆస్తులను కబ్జా పెట్టిండు. రోహిత్ రెడ్డి బయటకు వస్తే ప్రజలకు మంచిది కాదు.
  • ఇలాంటి చీడ పురుగులను లోపలే ఉంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి

ఈ సందర్భంగా గాంధీ భవన్ ఎదుట ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టి బొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు.

Tags:    

Similar News