Vintage Car Rally in Hyderabad: హైదరాబాద్‌లో వింటేజ్ కార్ ర్యాలీ.. ఓల్డ్ ఈజ్ గోల్డ్‌కు నిదర్శనం

హైదరాబాద్‌లో రవాణా శాఖ ఆధ్వర్యంలో వింటేజ్ కార్ ర్యాలీ జరిగింది. పాత వాహనాల మెయింటెనెన్స్, రోడ్ సేఫ్టీపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Update: 2026-01-27 06:57 GMT

Vintage Car Rally in Hyderabad: హైదరాబాద్‌లో వింటేజ్ కార్ ర్యాలీ.. ఓల్డ్ ఈజ్ గోల్డ్‌కు నిదర్శనం

Vintage Car Rally in Hyderabad:  హైదరాబాద్ నగరంలో వింటేజ్ వాహనాల సందడి కనిపించింది. రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయం నుంచి సంజీవయ్య పార్క్ వరకు వింటేజ్ కార్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి నగరవాసులు, వింటేజ్ వాహన ప్రేమికుల నుంచి మంచి స్పందన లభించింది.

రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వింటేజ్ కార్ అండ్ బైక్ ర్యాలీని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఇలంబర్తి జెండా ఊపి ప్రారంభించారు. ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయం నుంచి నెక్లెస్ రోడ్ మీదుగా సంజీవయ్య పార్క్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 50 ఏళ్ల క్రితం తయారైన 70కి పైగా వింటేజ్ కార్లు పాల్గొన్నాయి.

రోడ్ సేఫ్టీ మంత్‌లో భాగంగా ఈ ర్యాలీని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. వాహనాన్ని సక్రమంగా మెయింటేన్ చేస్తే పాత వాహనాలైనా ఫిట్‌గా, సురక్షితంగా నడవగలవని ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. టూ వీలర్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపే వారు సీట్ బెల్ట్ వాడాలని ఈ సందర్భంగా సూచించారు.

ఈ ర్యాలీలో 1915 నుంచి 1970 మధ్య కాలానికి చెందిన వింటేజ్ వాహనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 1914 మోడల్ వింటేజ్ కారు ఈ కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆస్టిన్, జీప్, మర్సిడెజ్ వంటి పాత మోడల్ వాహనాలు కూడా పాల్గొనగా, కొన్ని అరుదైన అమెరికన్ వింటేజ్ కార్లు వాహన ప్రేమికులను ఆకట్టుకున్నాయి.

వింటేజ్ కార్లను ప్రత్యక్షంగా చూడటం ఆనందంగా ఉందని వింటేజ్ కార్ లవర్స్ తెలిపారు. ఎన్ని కొత్త మోడల్ వాహనాలు మార్కెట్‌లోకి వచ్చినా, పాత వాహనాలు నడిపే అనుభూతే వేరని వారు అభిప్రాయపడ్డారు. రవాణా శాఖ ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని సార్లు నిర్వహించాలని కోరారు.

Tags:    

Similar News