Champapet Corporator Vanga Madhusudhan Reddy: చంపాపేట్ కార్పొరేటర్ వంగా మధుసూధన్ రెడ్డి అకాలమరణం
Champapet Corporator Vanga Madhusudhan Reddy: చంపాపేట్ కార్పొరేటర్ వంగా మధుసూధన్ రెడ్డి అకాలమరణంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి కుటుంబాన్ని పరామర్శించారు.
Champapet Corporator Vanga Madhusudhan Reddy: చంపాపేట్ కార్పొరేటర్ వంగా మధుసూధన్ రెడ్డి అకాలమరణం
Champapet Corporator Vanga Madhusudhan Reddy: హైదరాబాద్ చంపాపేట్‌లో విషాదం చోటుచేసుకుంది. చంపాపేట్ కార్పొరేటర్ వంగా మధుసూధన్ రెడ్డి అకాలమరణం నగర రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
పార్టీ కార్యక్రమాల నిమిత్తం పర్యటనలో ఉండటంతో కార్పొరేటర్ అంత్యక్రియలకు హాజరు కాలేకపోయినట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే ఆయన నేరుగా వంగా మధుసూధన్ రెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చిన కేంద్ర మంత్రి, ఈ కష్ట సమయంలో తమ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కార్పొరేటర్ అకాలమరణం ప్రజాసేవకు తీరని లోటని పేర్కొన్న కిషన్ రెడ్డి, మధుసూధన్ రెడ్డి సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనతో చంపాపేట్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.