DSP Transfers Telangana: తెలంగాణ పోలీస్ శాఖలో డీఎస్పీల బదిలీలు.. ఎన్నికల వేళ కీలక ఉత్తర్వులు
DSP Transfers: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు తెలంగాణ పోలీస్ శాఖలో ఐదుగురు డీఎస్పీల బదిలీలు జరిగాయి. డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వచ్చాయి.
DSP Transfers Telangana: తెలంగాణ పోలీస్ శాఖలో డీఎస్పీల బదిలీలు.. ఎన్నికల వేళ కీలక ఉత్తర్వులు
DSP Transfers Telangana: తెలంగాణ పోలీస్ శాఖలో కీలక బదిలీలు చోటు చేసుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ నేడో రేపో విడుదలయ్యే అవకాశాలున్న నేపథ్యంలో, ఐదుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సిఫార్సుల మేరకు ఈ బదిలీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, బదిలీ అయిన అధికారులు తక్షణమే ప్రస్తుత విధుల నుంచి రిలీవ్ అయి కొత్త పోస్టింగ్‌లో చేరాలని ఆదేశించారు.
ప్రధాన బదిలీలు ఇలా ఉన్నాయి:
ఎస్. సారంగపాణి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీజీపీఏ స్టాండ్స్‌లో డీఎస్పీగా, ఇల్లందు ఎస్‌డీపీఓగా విధులు నిర్వహిస్తున్న సారంగపాణిని ఖమ్మం జిల్లా వైరా ఏసీపీగా బదిలీ చేశారు. దీంతో ఆయన ఇల్లందు ఎస్‌డీపీఓ పోస్టింగ్ రద్దైంది.
పద్మనాభుల శ్రీనివాస్
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో డీఎస్పీగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను వైరా ఏసీపీ పోస్టు నుంచి తొలగించి, జీహెచ్‌ఎంసీ అదనపు ఎస్‌పీ ఖాళీ పోస్టులోనే కొనసాగించాలని నిర్ణయించారు.
యు. వెంకన్న బాబు
ఇంటెలిజెన్స్ విభాగంలో డీఎస్పీగా ఉన్న వెంకన్న బాబును ఇల్లందు ఎస్‌డీపీఓగా నియమించారు.
బి. ప్రకాశ్
సైబరాబాద్‌లో ఏసీపీ (ఎస్‌బీ)గా పనిచేస్తున్న ప్రకాశ్‌ను నిజామాబాద్ (టీ) ఏసీపీగా బదిలీ చేశారు.
ఎల్.ఆర్. వెంకట్ రెడ్డి
నిజామాబాద్ (టీ) ఏసీపీగా ఉన్న వెంకట్ రెడ్డిని హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
వీరంతా విధుల్లో చేరిన అనంతరం సీటీసీ నివేదికలు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.