Telangana Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. రాష్ట్రవ్యాప్తంగా కోడ్ అమలు

Telangana Municipal Elections: తెలంగాణలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.

Update: 2026-01-27 10:59 GMT

Telangana Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. రాష్ట్రవ్యాప్తంగా కోడ్ అమలు

Telangana Municipal Elections : తెలంగాణలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె అధికారికంగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.

మున్సిపల్ ఎన్నికల ముఖ్య తేదీలు ఇవీ:

జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

జనవరి 30 వరకు నామినేషన్ల స్వీకరణ గడువు

జనవరి 31న నామినేషన్ల పరిశీలన

ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు

ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహణ

అవసరమైతే ఫిబ్రవరి 12న రీపోలింగ్

ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు

ఫిబ్రవరి 16న మున్సిపల్ ఛైర్మన్‌, వైస్ ఛైర్మన్ ఎన్నిక

అదే రోజు కార్పొరేషన్ మేయర్‌, డిప్యూటీ మేయర్ ఎన్నికలు

ఈ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 53 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Tags:    

Similar News