Harish Rao: కోవిషీల్డ్ టీకా డోసుల వ్యవధి తగ్గించండి..కరోనా వారియర్స్‌కి బూస్టర్ డోస్..
Harish Rao: కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధి తగ్గించాలంటూ తెలంగాణ హెల్త్ మినిస్టర్ హరీష్‌రావు కేంద్రాన్ని కోరారు.
Harish Rao: కొవీ షీల్డ్ టీకా డోసుల వ్యవధి తగ్గించండి
Harish Rao: కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధి తగ్గించాలంటూ తెలంగాణ హెల్త్ మినిస్టర్ హరీష్‌రావు కేంద్రాన్ని కోరారు. రెండు డోస్‌ల మధ్య 12 వారాల వ్యవధి ఉండడంతో ఇబ్బంది ఉందన్నారు. గతంలో మాదిరిగా 4-6 వారాలకు తగ్గించాలంటూ వైద్యారోగ్యశాఖ మంత్రికి ఆయన లేఖ రాశారు. వలస కూలీలు మొదటి డోస్ వేసుకున్న తర్వాత ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని వారికి సెకండ్ డోస్ వేయడం కష్టమవుతుందన్నారు. మొదటి డోస్ వేసుకున్నవారి వివరాలు కొవిన్ పోర్టర్‌లో అప్లోడ్ చేస్తున్నా ఆ జాబితా ఆ రాష్ట్రానికే పరిమితం కావడంతో వలస కూలీలను అప్రమత్తం చేయలేకపోతున్నట్టు చెప్పారు. మరోవైపు కరోనా వారియర్స్‌కి బూస్టర్ డోస్ వేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.