Governor Tamilisai: వరంగల్‌లోని వరద ముంపు ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై పర్యటన
Governor Tamilisai: ముంపు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
Governor Tamilisai: వరంగల్‌లోని వరద ముంపు ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై పర్యటన
Governor Tamilisai: వరంగల్‌లోని ముంపు ప్రాంతాల్లో గవర్నర్ తమిళి సై పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గవర్నర్ అన్నారు. వరంగల్‌లో వరదలు తీవ్రస్థాయిలో వచ్చాయని.. జవహార్ నగర్ బ్రిడ్జ్ పూర్తిగా కూలిపోయిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అన్నారు.తాగునీరు, నిత్యావసర వస్తువులు, మెడికల్ కిట్లు అందించాలన్నారు. కేంద్ర బృందం వచ్చి నష్టాన్ని అంచనా వేస్తోందని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయం గవర్నర్ తమిళి సై కొనియాడారు.