Harish Rao: కేసీఆర్ ప్రెస్‌మీట్ తర్వాత రేవంత్ సర్కార్ డిఫెన్స్‌లో పడింది
Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Harish Rao: కేసీఆర్ ప్రెస్‌మీట్ తర్వాత రేవంత్ సర్కార్ డిఫెన్స్‌లో పడింది
Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల ప్రెస్ మీట్ తర్వాత రేవంత్ సర్కార్ డిఫెన్స్ లో పడిందన్నారు. 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. రాత్రి తొమ్మిదిన్నర గంటలకు సీఎం చిట్ చాట్ పెట్టడం చూడలేదన్నారు. అందాల పోటీలు, ఫుట్‌బాల్ షోకులు, గ్లోబల్ సమ్మిట్ లు అన్నం పెడతాయా? అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డికి వాస్తు భయం పట్టుకుందని అందుకే సచివాలయం పోవడం లేదని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాలుగు వేల సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించిందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను నామినేట్ చేయాలని చూస్తున్నారని అన్నారు. ఇరిగేషన్ పై పీపీటీని స్వాగతిస్తున్నామని.. పీపీటీపై అసెంబ్లీలో మా గొంతు నొక్కడం.. మైక్ కట్ చేయవద్దన్నారు. ఎవరి వాదన నిజమో ప్రజలే తేల్చుతారన్నారు.