ఆదాయానికి మించిన ఆస్తులు.. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఆస్తులపై ఏసీబీ సోదాలు
మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఆయన నివాసంతో పాటు పలుచోట్ల తనిఖీలు నిర్వహిస్తోంది ఏసీబీ.
మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఆయన నివాసంతో పాటు పలుచోట్ల తనిఖీలు నిర్వహిస్తోంది ఏసీబీ. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఇటీవల కేసు నమోదైంది. అయితే కిషన్ నాయక్‌కు దాదాపు 100 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలో కిషన్ నాయక్ నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.