ఉద్దేశ పూర్వకంగా చెక్ డ్యామ్‌ను కూల్చివేసారు- డా. రాజేంద్రసింగ్
పెద్దపల్లి జిల్లా గుంపులలోని తనుగుల చెక్ డ్యామ్‌ను వాటర్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా డాక్టర్ రాజేంద్రసింగ్ పరిశీలించారు.
పెద్దపల్లి జిల్లా గుంపులలోని తనుగుల చెక్ డ్యామ్‌ను వాటర్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా డాక్టర్ రాజేంద్రసింగ్ పరిశీలించారు. కొంతమంది ఉద్దేశ పూర్వకంగా చెక్ డ్యామ్ ను కూల్చివేసారని ఆయన విమర్శించారు. ఇసుక కోసం గుర్తుతెలియని వ్యక్తులు చెక్ డ్యామ్‌ను పేల్చివేయడం హేమమైన చర్య అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేది కేవలం సాగు నీరే అని తెలిపారు.