Ramchander Rao: ఆర్థిక సంస్కరణలతో భారత్‌ను కొత్తదారిలో నడిపించిన వ్యక్తి పీవీ నరసింహారావు
Ramchander Rao: పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా.. హైదరాబాద్‌లోని పీవీ ఘాట్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నివాళులు అర్పించారు.
Ramchander Rao: పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా.. హైదరాబాద్‌లోని పీవీ ఘాట్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నివాళులు అర్పించారు. భారత్‌ను ఆర్థిక సంస్కరణలతో కొత్త దారిలో నడిపించిన వ్యక్తి పీవీ నరసింహారావు అని ఆయన గుర్తుచేశారు. పీవీ సంస్కరణలకు ప్రతిపక్ష నేతగా వాజ్‌పేయి సంపూర్ణ సహకారం అందించారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావుకు సరైన గౌరవం ఇవ్వలేదన్న ఆరోపించారు. గాంధీ కుటుంబానికి మాత్రమే కాంగ్రెస్‌లో గౌరవమా? అంటూ ప్రశ్నించారు. గాంధీ పేరుతో రాజకీయాలు మానేసి ప్రజా నాయకులను గౌరవించాలని రాంచందర్ రావు సూచించారు.