Shamshabad Airport: వరుస బాంబు బెదిరింపులు.. పోలీసులు సీరియస్.. ఏం చేయనున్నారంటే?
Shamshabad Airport: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి.
Shamshabad Airport: వరుస బాంబు బెదిరింపులు.. పోలీసులు సీరియస్.. ఏం చేయనున్నారంటే?
Shamshabad Airport: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది.. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం బాంబు స్క్వాడ్‌తో పాటు ఇతర భద్రతా సిబ్బంది ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేశాయి. వరుస మెయిల్స్ నేపథ్యంలో శంషాబద్ ఎయిర్‌పోర్టు అధికారులు దృష్టి సారించారు.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు 28 బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంపై ఫోకస్ చేశారు. ఈ ఫేక్ బెదిరింపు మెయిల్స్ అన్నింటినీ కూడా డార్క్ వెబ్‌ను ఉపయోగించి దుండగులు పంపిస్తున్నట్లుగా నిర్ధారించారు. దీంతో ఈ ఫేక్ బెదిరింపు మెయిల్స్‌పై నమోదైన కేసులను సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేయాలని నిర్ణయించింది.