Free corona test center in hyderabad: కరోనా లక్షణాలను బట్టి ఈ హాస్పిటళ్లలో ఉచిత టెస్టులు

Free corona test center in hyderabad : కరోనా పాజిటివ్ అని తేలిన ఎవరైనా గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందొచ్చని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ కె.రమేశ్ రెడ్డి తెలిపారు.

Update: 2020-07-04 14:37 GMT

Free corona test center in hyderabad: కరోనా పాజిటివ్ అని తేలిన ఎవరైనా గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందొచ్చని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ కె.రమేశ్ రెడ్డి తెలిపారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరికైనా కేవలం శ్వాస సంబంధ సమస్యలు మాత్రమే ఉంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌కు వెళ్లాలని ఆయన సూచించారు. కరోనా లక్షణాలున్న వారిని కింగ్ కోఠీ హాస్పిటల్‌లో చేర్చుకుంటారని.. అవసరమైతే టెస్టులు చేసి చికిత్స అందిస్తారని డాక్టర్ రమేశ్ రెడ్డి తెలిపారు. కరోనా పాజిటివ్ అని తేలిన వారిని మాత్రమే గాంధీలో చేర్చుకుంటామన్నారు. ఒక వేళ ఒకటి కంటే ఎక్కువ కరోనా లక్షణాలు కనిపిస్తే.. కింగ్ కోఠీ హాస్పిటల్‌‌కు వెళ్లాలన్నారు. ఈ సూచనలు పాటిస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని.. మళ్లీ వెనక్కి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదని ఆయన చెప్పారు.

హైదరాబాద్ నగరంలో 11 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా టెస్టులను ఉచితంగా చేస్తున్నారని తెలిపారు. కోఠిలోని కింగ్ కోఠి హాస్పిటల్, నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్, చార్మినార్ నిజామియా టీబీ హాస్పిటల్, ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్, అమీర్‌పేట నేచర్ క్యూర్ హాస్పిటల్, మెహదీపట్నం సరోజినీదేవి కంటి ఆసుపత్రి, ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రి, రామాంతపూర్ హోమియోపతి హాస్పిటల్, కొండాపూర్ ఏరియా హాస్పిటల్, వనస్థలిపురంలోని ఏరియా హాస్పిటల్, నాచారం ఈఎస్ఐ హాస్పిటల్‌లో కరోనా లక్షణాలు ఉన్న వారు ఎవరైనా ఉచితంగా టెస్టులు చేయించుకోవచ్చని తెలిపారు.

తెలంగాణలో రోజు రోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఇబ్బందులేమి లేవన్నారు. వైద్యులు రోగులకు మంచి వైద్యం అందిస్తున్నారన్నారని రమేశ్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం 812 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారని వారిలోనూ 100 మంది కొద్దిపాటి చికిత్స అనంతరం హోం ఐసోలేషన్‌లోకి వెళ్తారన్నారు. ఒక్క గాంధీ హాస్పిటల్‌లోనే ఆక్సిజన్ సౌకర్యంతో 2100 బెడ్లు, 350కిపైగా వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 

Tags:    

Similar News