సికింద్రాబాద్ పాలిక బజార్‌లో అగ్నిప్రమాదం.. ఓ షాపింగ్ కాంప్లెక్స్ సెల్లార్‌లో చెలరేగిన మంటలు
Fire Accident: సెల్లార్ నుంచి దుకాణాలకు అలుముకున్న పొగ
సికింద్రాబాద్ పాలిక బజార్‌లో అగ్నిప్రమాదం.. ఓ షాపింగ్ కాంప్లెక్స్ సెల్లార్‌లో చెలరేగిన మంటలు
Fire Accident: సికింద్రాబాద్ పాలిక బజార్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ షాపింగ్ కాంప్లెక్స్ సెల్లార్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలోని వ్యాపార సముదాయాలకు దట్టంగా పొగ వ్యాపించింది. ఒక్కసారిగా సెల్లార్ నుంచి పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని.. రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. అయితే ఫైర్ యాక్సిడెంట్‌కు షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా ఇంకేదైనా కారణముందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.