ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సీపీఐ సన్నాహాలు !

Update: 2020-09-15 10:49 GMT

రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయడానికి సీపీఐ సన్నద్ధం అవుతుంది. ఇప్పటికే ఆశావాహుల లిస్ట్ కూడా పార్టీ రాష్ట్ర కార్యవర్గం రెడీ చేసినట్లు తెలుస్తుంది. రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో గెలిచి పట్టు నిలుపుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అసెంబ్లీ ఆవరణలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిసినప్పుడు దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అధికార పార్టీతో ఒకవేళ ఒప్పందం కుదరకున్నా తాము ప్రత్యక్షంగా పోటీ చేయాలని సీపీఐ రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది.

వచ్చే ఏడాది ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌ పట్టభద్రుల ఎన్నికలకు సీపీఐ రెడీ అవుతుంది. రెండు చోట్లా పోటీ చేయాలని సీపీఐ నిర్ణయించింది. గెలిచే అవకాశాలున్న రిటైర్డ్ ఉద్యోగులను, జర్నలిస్టులను బరిలో దింపాలని భావిస్తోంది. పార్టీకి సంబంధించిన కొందరు పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు వారి పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే ఇతర పార్టీల నేతలతో చర్చించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. అయితే దుబ్బాక ఎన్నికల్లో పోటీపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని స్వతహాగా పోటీ చేయాలా లేదంటే ఏదైనా పార్టీకి మద్దతు ఇవాళ అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.

శాసనసభ ఆవరణలో కొత్త రెవెన్యూ చట్టంపై చాడ వెంకట్ రెడ్డి ని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఆహ్వానించిన నేపథ్యంలో వీరి కలయిక సర్వత్రా చర్చకు దారి తీస్తుంది. కొత్త చట్టంపై చాడ సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఈ ఇరువురు మరోసారి భేటి కావాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే ముందు నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై పోరాడే సీపీఐ ఎంత వరకు అధికార పార్టీకి మద్దతు ఇస్తుందో వేచి చూడాల్సిన అవసరముంది.

గత శాసనసభ ఎన్నికల తరువాత కాంగ్రెస్, టీడీపీ తెలంగాణ జనసమితి ఇతర ప్రజా సంఘాలతో కలిసి అన్నింట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేవారు. అయితే అధికార టీఆర్ఎస్ తో ఎలాంటి ఒప్పందం కుదరకపోతే ఈ రెండు పట్టభద్రుల ఎన్నికల్లో ఒకటి టీజేఎస్ నుండి కోదండరాం పోటీ చేయాలని ఇప్పటికే ప్రకటించింది. ఈ స్థానానికి సీపీఐ మద్దతివ్వకుండా పోదు మిగిలిన ఒక్క స్థానంలో మాత్రం అన్ని పార్టీల మద్దతు తీసుకొని పోటీ చేయాలని భావిస్తోంది.

Tags:    

Similar News