హైదరాబాద్ టు ముంబయి.. జెట్ స్పీడ్ లో బుల్లెట్ ట్రెయిన్

హైదరాబాద్ టు ముంబయి.. జెట్ స్పీడ్ లో బుల్లెట్ ట్రెయిన్
x
Highlights

హైదరాబాద్ హమానగర కీర్తి మరింత ఎత్తుకు ఎదగబోతోంది. భాగ్యనగరం మరో కలికితురాయి చేరే అవకాశం కనిపిస్తుంది. అది ఏంటి అనుకుంటున్నారా. దేశ ఆర్థిక రాజధానిగా...

హైదరాబాద్ హమానగర కీర్తి మరింత ఎత్తుకు ఎదగబోతోంది. భాగ్యనగరం మరో కలికితురాయి చేరే అవకాశం కనిపిస్తుంది. అది ఏంటి అనుకుంటున్నారా. దేశ ఆర్థిక రాజధానిగా పేరుపొందిన పొంది ముంబయి మహానగరాన్ని హైదరాబాద్‌తో అనుసంధానిస్తూ బుల్లెట్‌ రైలు పరుగులు పెట్టవచ్చునని సమాచారం. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడు కొత్త బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులకు త్వరలోనే శ్రీకారం చుట్టే దిశగా ప్రణాళికలు రూపొందించింది. ఈ ఏడు మార్గాల్లో ముంబయి-హైదరాబాద్‌ మార్గం కూడా ఒకటి. ఈ ఏడు ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం సుమారుగా రూ.10 లక్షల కోట్లు అని ఓ అధికారి వెల్లడించారు. ఇక జాతీయ హైస్పీడ్‌ రైలు కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌)ను కేంద్రం ఈ ఏడు మార్గాలకు సంబంధించిన ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్‌)లను సిద్ధం చేయాలని ఆదేశించింది.

ఇక పోతే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశంలోనే మొదటి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య (508.17 కిలోమీటర్లు) ప్రారంభించింది. నిజానికి కేంద్రం ప్రభుత్వం ఆ రైలుమార్గంలో 2023 డిసెంబరులో బుల్లెట్‌ రైలు సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాని అంచనా వ్యయం కూడా రూ.1.08 లక్షల కోట్లుగా పేర్కొంది. అయితే ప్రారంభ తేదీని 2028 అక్టోబరుకు వాయిదా వేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. కొన్ని కారణాలు అంటే దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరించడం, భూ సేకరణ సంబంధిత సమస్యలు ఏర్పడడం లాంటి ఆటంకాలతో అనుకున్న తేదీకి ప్రారంభించలేకపోతున్నారనే సమాచారం. ఇక ఇప్పటికే ముంబయి-అహ్మదాబాద్‌ ప్రాజెక్టు కోసం 63 శాతం భూ సేకరణ పూర్తయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories