Top
logo

హైదరాబాద్‌ మెట్రో సేవలు ప్రారంభం

హైదరాబాద్‌ మెట్రో సేవలు ప్రారంభం
X
Highlights

168 రోజుల విరామం అనంతరం దేశవ్యాప్తంగా మెట్రో రైల్ సేవలు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ లో కూడా ఉదయం...

168 రోజుల విరామం అనంతరం దేశవ్యాప్తంగా మెట్రో రైల్ సేవలు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ లో కూడా ఉదయం 7 గంటల నుంచి మెట్రో రైళ్లు పట్టాలెక్కాయి. కరోనా కారణంగా భౌతిక దూరాన్ని పాటించడానికి మెట్రో స్టేషన్లు, మెట్రో రైలు లోపల కూడా గుర్తులను మార్క్‌ చేశారు. హైదరాబాద్‌లో మెట్రో సర్వీసులు తిరిగి ప్రారంభం అయినా, నేడు కేవలం కారిడార్-1 మియాపూర్ - ఎల్‌బీ నగర్ మార్గంలో మాత్రమే మైట్రో పరుగులు పెడుతోంది. సెప్టెంబర్ 7న కారిడార్-1, 8న కారిడార్-3, సెప్టెంబరు 9నుంచి అన్ని మెట్రో రైళ్ల సేవలు తిరిగి అందుబాటులోకి వస్తాయని హైదరాబాద్ మెట్రో సంస్థ అధికారులు వెల్లడించారు.Web TitleHyderabad Metro Started
Next Story