Chidambaram: తెలంగాణలో కాకరేపుతోన్న చిదంబరం వ్యాఖ్యలు

Chidambaram: చిదంబరం వ్యాఖ‌్యల నుంచి బయటపడటానికి నానా తంటాలు పడుతున్న కాంగ్రెస్

Update: 2023-11-17 13:06 GMT

Chidambaram: తెలంగాణలో కాకరేపుతోన్న చిదంబరం వ్యాఖ్యలు

Chidambaram: తెలంగాణ ఇచ్చిందెవరు..? తెచ్చిందెవరు..? ఆత్మబలిదానాలకు కారణం ఎవరు..?ఎన్నికల వేళ ఇదే విషయంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సరిగ్గా ఇదే టైంలో గాంధీ భవన్‌ వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో మంటలు పుట్టిస్తున్నాయి. దశాబ్ధాల గాయాన్ని మళ్లీ రగిలించినట్టైంది. తెలంగాణ ఉద్యమంలో వందల మంది ప్రాణాలర్పించడం దురదృష్టకరమని, విద్యార్థుల ఆత్మబలిదానాలపై క్షమాపణలు చెబుతున్నానంటూ చిదంబరం అన్న మాటలు పొలిటికల్ హీట్ రాజేసింది.

తెలంగాణ ఏర్పాటు విషయంలో తప్పు చేశామని కాంగ్రెస్ భావిస్తోందా..? 2009లో ప్రకటన చేసి మళ్లీ వెనక్కి తీసుకుని వందల మంది ప్రాణాత్యాగానికి కారణం అయ్యామని హస్తం పెద్దలు అనుకుంటున్నారా.? అందుకే చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిదంబరం వ్యాఖ్యలపై పొలిటికల్ సర్కిల్ తో పాటు.. జనాల నుంచి కూడా ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణకు నష్టం చేసింది ఎవరు.. వందల సంఖ్యలో ప్రాణ త్యాగాలకు కారణం ఏవరంటూ మండిపడుతున్నారు. రాష్ట్ర విభజనను ఏళ్ల పాటు నాన్చడం వల్లే అమయాకులు బలి అయ్యారని ఫైర్ అవుతున్నారు.

తెలంగాణ ఏర్పాటు వంటి సున్నితమైన అంశాన్ని చిదంబరం టచ్ చేయడంతో.. బీఆర్ఎస్ ముఖ్యనేతలు హరీష్ రావు, కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వందల మంది విద్యార్థుల బలి దానాలకు కాంగ్రెస్సే కారణమని చిదంబరం వ్యాఖ్యలతో తెలుస్తోందని గులాబీ దళం ఫైర్ అవుతోంది. గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా అంటూ కవిత ట్వీట్ చేశారు. మొత్తానికి ఎన్నికల వేళ చిదంబరం వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు నష్టం చేసేలా ఉన్నాయంటూ హస్తంలో గుబులు స్టార్ట్ అయింది. చిదంబరం వ్యాఖ‌్యల నుంచి బయటపడటానికి నానా తంటాలు పడుతుంది.

Tags:    

Similar News