Chalo Bus Bhavan: ఆర్టీసీ ఛార్జీల పెంపుపై BRS చలో బస్ భవన్
Chalo Bus Bhavan: ఆర్టీసీ టికెట్ ధరల పెంపుపై బీఆర్ఎస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది.
Chalo Bus Bhavan: ఆర్టీసీ ఛార్జీల పెంపుపై BRS చలో బస్ భవన్
Chalo Bus Bhavan: ఆర్టీసీ టికెట్ ధరల పెంపుపై బీఆర్ఎస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. నిరసన కార్యక్రమాలను చేపట్టింది. ఛార్జీల పెంపునకు నిరసనగా ఛలో బస్ భవన్‌కు పిలుపునిచ్చింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ నేతలు బస్ భవన్‌కు చేరుకోనున్నారు.
రేతిఫైల్ బస్టాప్ నుంచి కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్... మెహదీపట్నం నుంచి హరీష్‌రావు బస్ భవన్‌కు చేరుకుని.. ఆర్టీసీ ఎండీకి మెమోరాండం అందించనున్నారు. అయితే.. బీఆర్ఎస్ బస్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్‌కు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఉప్పల్ ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేశారు. కేటీఆర్, హరీష్‌రావు ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు.