Ramchander Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు రాష్ట్రాన్ని లూటీ చేశాయి
Ramchander Rao: తెలంగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లూటీ చేశాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రాంచందర్ రావు ఆక్షేపించారు.
Ramchander Rao: తెలంగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లూటీ చేశాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రాంచందర్ రావు ఆక్షేపించారు. రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ వల్లనే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి గ్రూప్ వన్ నియామకాలు జరగలేవని మండిపడ్డారు. జీఎస్టీ వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతోందని చెప్పారు రాంచందర్ రావు.