మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయం.. కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తప్పతాగి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు తన కుటుంబం మంచిగా ఉంటే చాలని, ప్రజలు అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. అవినీతి టీఆర్ఎస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందన్న బండి సంజయ్. కారు.. సారు.. ఇక రారు అంటూ ఫైర్ అయ్యారు.
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ తీసుకొద్దామని ప్రధాని మోడీ ప్రయత్నం చేస్తుంటే దానిపై కూడా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ నేతలనుద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న భారత్ బయోటెక్‌ను కేసీఆర్ ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ కార్పొరేట్ ఆస్పత్రులతో కుమ్మక్కయ్యారని అందుకే కోవిడ్ వ్యాక్సిన్ రాకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వరదలు వచ్చినప్పుడు ఫార్మ్‌హౌస్ నుంచి బయటకురాని సీఎం కేసీఆర్ మోడీ ఎందుకు రాలేదని ప్రశ్నించడం దిగుజారుడుతనానికి నిదర్శనమన్నారు బండి సంజయ్.