మంత్రి కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్ ట్వీట్

Minister KTR Vs Bandi Sanjay: మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.

Update: 2023-03-30 13:03 GMT

మంత్రి కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్ ట్వీట్

Minister KTR Vs Bandi Sanjay: మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాని మోడీని మంత్రి కేటీఆర్ టార్గెట్ చేస్తూ ట్వీట్ చేస్తే.. దానికి కౌంటర్‌గా బండి సంజయ్ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఉద్యమకారులకు పార్టీలో చోటివ్వలేదు.. దళితులకు మూడెకరాలు ఇవ్వలేదు.. ఖాళీలున్నా ఉద్యోగాలను భర్తీ చేయడంలేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వడంలేదు.. దళితబంధు అర్హులకు ఇవ్వడంలేదు.. ప్రకటనలే తప్ప ఆలయాలకు సైతం నిధులు ఇవ్వమని కేసీఆర్ అన్నారని బండి సంజయ్ ట్వీట్ చేశారు. అసలు సీఎం కేసీఆర్ ప్రధాన బాధ్యతల్లో ప్రజలకు చోటివ్వన్నప్పుడు.. సీఎంను ఎందుకు భరించాలి..? సహించాలి..? అని ఎద్దేవా చేశారు. అసలు కేసీఆర్ తన పార్టీ నుంచి తెలంగాణను తొలగించారని.. అలాంటప్పుడు ఆయనకు ఎందుకు ఈ రాష్ట్రం నుంచి తొలగించకూడదని ట్వీట్టర్ వేదికగా ప్రశ్నించారు.


Tags:    

Similar News