Jukkal: ఆధునిక క్రీడల యుగంలోనూ తగ్గని ఆదరణ

Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో బర్షీ పండుగను పురస్కరించుకొని సోమవారం ఘనంగా కుస్తీ పోటీలు నిర్వహించారు.

Update: 2026-03-30 14:38 GMT

Jukkal: ఆధునిక క్రీడల యుగంలోనూ తగ్గని ఆదరణ

Jukkal: ప్రస్తుత సమాజంలో రోజురోజుకు ఎన్నో ఆధునిక క్రీడలు పుట్టు కొచ్చినప్పటికీ జుక్కల్ ప్రాంతంలో మాత్రం కుస్తి పోటీకి ఉన్నంత ఆదరణ దేనికి లేదనడానికి నిదర్శనం.జుక్కల్ మండల కేంద్ర శివారులో గల మహదేవ్ ఆలయం వద్ద బర్షి పండుగను పురస్కరించుకొని సోమవారం పోలీస్ పాటిల్, గ్రామ పెద్దల సహకారంతో కుస్తి పోటీలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా లోనే జుక్కల్ ప్రాంతంలో దత్త జయంతి వచ్చిందంటే చాలు ఆనాటి నుండి మొదలు కొని వరుసగా నాలుగు నెలల పాటు నెలకు జరిగే ఒక పండుగ సందర్భంగా ఒక ప్రాంతంలో ఈ కుస్తి పోటీలు నిర్వహించడం ఇక్కడి అనవాయితీ.

కుస్తి పోటీలో తలపడేందుకు పురుషులతో తలపడేందుకు కర్ణాటక ఔరాద్ కు చెందిన 10 తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు తలపడి ఒకరు ఓటమి చెందగా, మరొక్క విద్యార్థిని పవర్ కల్పన గెలుపొందింది.చుట్టూ పక్కల ప్రాంతాల వారితోపాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుండి మల్ల యోధులు తరలివచ్చి కుస్తీ పోటీలో ప్రత్యర్థి మల్ల యోధులతో తల పడతారు. కుస్తి పోటీలు తిలకించేందుకు వచ్చిన ప్రేక్షకులతో కుస్తీ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది.బర్షి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన కుస్తి పోటీలు కొబ్బరి కాయ,10 రూపాయల తో మొదలైన పోటీలు 5 వేల 51 రూపాయలతో చివరి కుస్తి పోటీ నిర్వహించారు.

చిట్ట చివరి కుస్తి పోటీలో తలపడి విజేతగా నిలిచిన మద్నూర్ మండలం అంతాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ మల్ల యోధుడికి జుక్కల్ కుస్తీ నిర్వాహక కమిటి సభ్యుల చేతుల మీదుగా 5 వేల 51 రూపాయల నగదును బహుకరించారు. సాయంత్రం మొదలైన పోటీలు చీకటి పడేవరకు కొనసాగాయి. కుస్తీ పోటీలు తిలకించేందుకు వచ్చిన ప్రేక్షకులు, శివుని భక్తులందరికీ పోటి నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

పూజ కార్యక్రమం తో ప్రారంభమైన కుస్తీ పోటీలు.

జుక్కల్ మండల కేంద్రంలో బర్సీ పండుగను పురస్కరించుకొని సోమవారం నిర్వహించిన కుస్తీ పోటీలను ముందుగ కుస్తీ మైదానంలో మహాదేవుడికి పోటి నిర్వాహకుల చేతుల మీదుగా పూజ చేసిన అనంతరం అనంతరం ప్రారంభించిన కుస్తీ పోటీలో జుక్కల్ పోలీస్ పాటిల్ నిలు పాటిల్,మహాదేవా ఆలయ చైర్మన్ షణ్ముఖ పాటిల్, మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ కె.. సాయ గౌడ్, మాజి సొసైటీ చైర్మన్ శివానంద్, మాజి ఎంపి పి బస్వంత్ సెట్కార్, భూమన్న, ఆయిల్వర్ గంగారం, బోర్గి సంజీవ్, ఉప సర్పంచ్ ఫిర్దోష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News