Choppadandi: ప్రజా పనులు గాలికి.. సొంత పనులకు సిబ్బంది వినియోగం!

Choppadandi: కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వ సిబ్బందిని, వాహనాలను తన వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్నారని తాడూరి శివకృష్ణ ఆరోపించారు.

Update: 2026-03-30 13:14 GMT

Choppadandi: ప్రజా పనులు గాలికి.. సొంత పనులకు సిబ్బంది వినియోగం!

Choppadandi: కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ సిబ్బందిని స్వంత పనులకు వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ బిజెపి నేత తాడూరి శివకృష్ణ ప్రజావాణిలో జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం సమర్పించిన వినతిపత్రంలో మున్సిపల్ పరిధిలో ప్రజా పనులకు వినియోగించాల్సిన సిబ్బందిని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడం వల్ల పట్టణంలో పారిశుద్ధ్య పనులు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మరియు ఇతర సిబ్బందిని కమిషనర్ వ్యక్తిగత పనుల కోసం తరచుగా పంపుతున్నారని, దాంతో చెత్త సేకరణ, డ్రైనేజీ శుభ్రపరిచే పనులు సక్రమంగా జరగడం లేదని తెలిపారు. సిబ్బంది కొరత కారణంగా పట్టణంలోని పలు కాలనీల్లో చెత్త పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

మున్సిపల్ వాహనాలు, ట్రాక్టర్, ఆటోలను కూడా ప్రజా పనుల కంటే ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల పారిశుద్ధ్య నిర్వహణలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని, ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని తెలిపారు.

ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి మున్సిపల్ కమిషనర్‌పై తగు చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ సిబ్బందిని ప్రజా సేవలకు మాత్రమే వినియోగించేలా ఆదేశాలు ఇవ్వాలని బిజెపి నేత తాడూరి శివకృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్‌ కు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News