Vikarabad: మత్తుకు దూరంగా.. ప్రాణాలకు భారంగా రోడ్డు భద్రత అవగాహన సదస్సు
Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో 'ప్రజాపాలన ప్రగతి' కార్యక్రమంలో భాగంగా "అరైవ్ అలైవ్" కార్యక్రమం జరిగింది.
Vikarabad: మత్తుకు దూరంగా.. ప్రాణాలకు భారంగా రోడ్డు భద్రత అవగాహన సదస్సు
Vikarabad: రోడ్డు ప్రమాదాలు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. 99 రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన ప్రగతి అమలు కార్యక్రమంలో భాగంగా సోమవారం తాండూర్ మండలం కరణ్ కోట సిసిఐ కమ్యూనిటీ హాల్లో "అరైవ్ అలైవ్" కార్యక్రమంలో మాదకద్రవ్యాల వ్యతిరేకత, రోడ్డు భద్రతపై అవగాహన , ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ.
రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారని, ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతినెల రోడ్డు భద్రతపై సమావేశాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాల జరుగుతున్నాయని అదేవిధంగా హెల్మెట్ ధరించకపోవడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ సంఖ్యలో మరణాలు జరుగుతున్నాయని అన్నారు.
యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. యువత భవిష్యత్తు నాశనం కాకుండా మంచి సమాజ నిర్మాణానికి అందరి సహకారం అవసరమని అన్నారు. గ్రామ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు ఇవ్వడంపై సీసీఐ యాజమాన్యాన్ని కలెక్టర్ అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడుతూ..
రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ప్రతి వాహనదారుడి బాధ్యత అని అన్నారు. ముఖ్యంగా వాహనం నడిపే సమయంలో స్పష్టమైన కంటి చూపు ఉండటం అత్యంత అవసరమని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తుందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ మార్గదర్శకత్వంలో "అరైవ్ అలైవ్" కార్యక్రమం మూడవ విడతలో భాగంగా జిల్లావ్యాప్తంగా పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఉచిత వైద్య శిబిరంలో నిపుణులైన వైద్యులు ప్రజలకు, వాహనదారులకు కంటి పరీక్షలు నిర్వహించి, దృష్టి లోపాలు ఉన్నవారిని గుర్తించి అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.