Armoor: ఆర్మూర్ లో అల్ఫోర్స్ విద్యాసంస్థల వార్షికోత్సవం!
Armoor: ఆర్మూర్ లోని అల్ఫోర్స్ నరేంద్ర పాఠశాల వార్షికోత్సవం "ఆరోహణ్" ఘనంగా జరిగింది.
Armoor: ఆర్మూర్ లో అల్ఫోర్స్ విద్యాసంస్థల వార్షికోత్సవం!
ఆర్మూర్ న్యూస్: విద్యార్థులకు విజయాల పట్ల ఆసక్తి పెంచాలని మరియు క్రమశిక్షణ అలవర్చి ఉత్తమ స్థానాలలో స్థిరపడేలా కృషి చేయాలని శ్రీమతి గోనే లహరి - రఘు , మున్సిపల్ చైర్పర్సన్, ఆర్మూరు, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి గారితో కలిసి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో గల ఒక వేడుక మందిరంలో అల్ఫోర్స్ నరేంద్ర పాఠశాల "ఆరోహణ్" పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేందర్ రెడ్డి గారి విద్యా విధానాలను ప్రశంసిస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు మరియు వారు అందిస్తున్న ప్రోత్సాహం చాలా ప్రశంసనీయమైనదని కొనియాడారు.
వేడుకల సందర్భంగా విద్యార్థుల ప్రదర్శించినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి మరియు అత్యుత్తమ ప్రదర్శనలు కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.