Nagireddypur: అందరూ సమానమే.. పౌర హక్కుల దినోత్సవ స్ఫూర్తి!

Nagireddypur: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్‌లో సోమవారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Update: 2026-03-30 11:17 GMT

Nagireddypur: అందరూ సమానమే.. పౌర హక్కుల దినోత్సవ స్ఫూర్తి!

Nagireddypur: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్‌లో సోమవారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ కళావతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనాన్ని పూర్తిగా నిషేధించారని, ప్రతి పౌరుడు సమాన హక్కులు, గౌరవంతో జీవించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సమాజంలో వివక్షకు తావు లేకుండా అందరూ సౌభ్రాతృత్వంతో, పరస్పర గౌరవంతో కలిసి జీవించాలని ఆమె సూచించారు.

ప్రజలు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంపొందించుకోవాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను సక్రమంగా వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. గ్రామీణ స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజంలో సమానత్వ భావన మరింత బలపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గిర్దావర్ రజినీకాంత్ రెడ్డి, ఇతర రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు

Tags:    

Similar News