Karimnagar: మానవసేవే మాధవసేవ.. లయన్స్ క్లబ్ సేవలు

Karimnagar: లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరంతర అన్నదాన కార్యక్రమం విజయవంతంగా 365 రోజులు పూర్తి చేసుకుంది.

Update: 2026-03-30 10:38 GMT

Karimnagar: మానవసేవే మాధవసేవ.. లయన్స్ క్లబ్ సేవలు

కరీంనగర్: మానవ సేవయే మాధవ సేవగా భావించి, లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ గత ఏడాది కాలంగా నగరంలో నిరంతరాయంగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం నేటితో 365 రోజులు పూర్తి చేసుకుంది.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నగరంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మరియు రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు, 66వ డివిజన్ కార్పొరేటర్ వంగల పవన్ ముఖ్య అతిథులుగా హాజరై, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సమాజ సేవలో ముందుండి నడిచేది లయన్స్ క్లబ్..

ఈ సందర్భంగా మేయర్ కోలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఏర్పడ్డప్పటినుండి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుందన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్లు, అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు, సమాజ సేవకు ఉపయోగపడే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అందులో నేను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ మ్యడం శివకాంత్,ప్రెసిడెంట్ ముక్క శరత్ కృష్ణ,బట్టు వినోద్ మరియు క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు..

Tags:    

Similar News