Adilabad: గుడిహత్నూర్‌లో శివయ్య కల్యాణం వార్కరీ భజనలతో మార్మోగిన పురవీధులు!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లోని పురాతన శివాలయంలో శివపార్వతుల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది.

Update: 2026-03-31 01:56 GMT

Adilabad: గుడిహత్నూర్‌లో శివయ్య కల్యాణం వార్కరీ భజనలతో మార్మోగిన పురవీధులు!

ఆదిలాబాద్ జిల్లా: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని అతి పురాతన శివాలయంలో శివపార్వతుల కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఏడు రోజులుగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న అఖండ శివ హరినామ సప్త కార్యక్రమం వైభవంగా సాగింది. ఈ ఉత్సవాల్లో మహారాష్ట్రకు చెందిన విశిష్ట వార్కరీ సంప్రదాయం ప్రకారం ప్రత్యేకపూజలు, భజనలు నిర్వహించారు. పురవీధుల్లో నిర్వహించిన ఊరేగింపులో వార్కరీ భజనలు, డీజే పాటలు, యువతీ యువకులు చేసిన ఉత్సాహభరిత నృత్యాలు భక్తులను, స్థానికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకను తిలకించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 

Tags:    

Similar News