Hyderabad: జూలో కూలర్లు.. మూగజీవులకు ఉపశమనం

Hyderabad: భానుడి భగభగలకు మనుషులే మాడిపోతున్నారు. వేడిగాలులు కూడా తోడవడంతో ఉండలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. మరి జంతువుల పరిస్థితి ఏంటి..?

Update: 2021-03-28 09:47 GMT

Hyderabad: జూలో కూలర్లు.. మూగజీవులకు ఉపశమనం

Hyderabad: భానుడి భగభగలకు మనుషులే మాడిపోతున్నారు. వేడిగాలులు కూడా తోడవడంతో ఉండలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. మరి జంతువుల పరిస్థితి ఏంటి..? సమ్మర్ స్టార్ట్ అవడంతో హైదరాబాద్ లోని జూ పార్కులో వన్యప్రాణులకు కష్టాలు మొదలయ్యాయి. ఎండలు పెరగడంతో జూలోని జంతువులు విలవిల్లాడుతున్నాయి. జూలో ఎండిపోయిన చెట్ల నీడలో ఉండలేకపోతున్న మూగజీవుల రక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎయిర్ కూలర్లతో ఉపశమనం కలిగిస్తున్నారు. ఎండవేడిని తట్టుకునేందుకు జూలో కూల్ క్లైమేట్ క్రియేట్ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సూర్యప్రతాపం దెబ్బకు రోజు రోజుకు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మనుషులే కాదు హైదరాబాద్ జూలలో జంతువులకు సమ్మర్ కష్టాలు తప్పడం లేదు. ఎండ వేడిమి, వడగాలుల దెబ్బకు వన్యప్రాణులు అల్లాడిపోతున్నాయి. ఎండవేడి నుంచి జంతువులకు కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు జూ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూ ఎన్‌క్లోజర్లలో చల్లటి వాతావరణం ఉండేలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఎన్ క్లోజర్స్ దగ్గర కూలర్ ఫాగ్ మెషిన్, వాటర్ స్ప్రింకర్స్‌లు పెట్టారు. శరీరాన్ని చల్లబరిచే ఆహారాన్ని జంతువులకు ప్రత్యేకంగా అందిస్తున్నారు. వాటర్ సెటప్‌తో జూ అంతా చల్ల చల్లగా ఆహ్లదకరంగా మారింది. దీంతో సందర్శకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రత్యేకంగా పెద్దపులులు, చింపాంజీ ఎన్‌క్లోజర్లలో కూలర్స్‌ అమర్చారు. ఎన్‌క్లోజర్‌ పైభాగంలో మ్యాట్‌, తుంగ, గోనె సంచులువేసి చల్లగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. డార్క్‌ రూమ్‌లో ఉండే గబ్బిలాలు, పాములు, గుడ్లగూబలు, ముళ్ళ పంది తదితర జంతువుల ఎన్‌క్లోజర్‌పై గోనేసంచులు వేసి నీటితో చల్లగా ఉంచుతున్నారు. వేసవి కాలంలో వన్యప్రాణులకు ఎలాంటి హాని కలుగకుండా జూ వెటర్నరీ డాక్టర్ల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు మందులను ఇస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు జూ క్యూరేటర్‌ తెలిపారు.

మొత్తంగా వన్య ప్రాణుల పంజరాల ప్రాంగణాల్లో చల్లని వాతావరణం కల్పించేందుకు భారీ సన్నాహాలు చేశారు. వన్య ప్రాణులు తిరుగాడే పరిసరాల్లో జలాశయాలు ఏర్పాటు చేయడంతో పాటు తాగు నీరు సదుపాయాల్ని కల్పించారు. మరోవైపు రాత్రింబవళ్లు వాతావరణం చల్లగా ఉండేందుకు పిచికారితో నీరు చిమ్మడం వంటి రక్షణ చర్యలు తీసుకున్నారు. 

Tags:    

Similar News