Asaduddin Owaisi: 8 ఏళ్లుగా హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది..
Asaduddin Owaisi: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వీడియోపై ముస్లిం సమాజం నుంచి తీవ్ర నిరనస వ్యక్తం అవుతుంది.
Asaduddin Owaisi: 8 ఏళ్లుగా హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది..
Asaduddin Owaisi: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వీడియోపై ముస్లిం సమాజం నుంచి తీవ్ర నిరనస వ్యక్తం అవుతుంది. తాజాగా ఈ వ్యవహారంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. రాజాసింగ్ కామెంట్స్‌ను ఖండిస్తున్నట్టుగా తెలిపారు. మతాన్ని అడ్డం పెట్టుకుని హైదరాబాద్‌లో అల్లర్లకు పాల్పడేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఎనిమిదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బీజేపీ నేతల కారణంగా అలజడి రేగుతోందన్నారు. బీజేపీ ముస్లింలను ద్వేషిస్తోందని ఆరోపించారు. ప్రశాంతమైన రాష్ట్రాన్ని మత ఘర్షణల పేరిట అల్లకల్లోలంగా మార్చేసి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఒవైసీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
ప్రవక్త మహమ్మద్‌ను, ముస్లింలను బీజేపీ ద్వేషిస్తోంది. వారు భారతదేశ సామాజిక నిర్మాణాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. రాజాసింగ్ వ్యాఖ్యలకు ప్రధాని మోడీ, బీజేపీ మద్దతు ఇవ్వకపోతే వారు స్పందించాలి. అదేవిధంగా కొందరు లేవనెత్తిన నినాదాలను (సార్ తాన్ సే జుడా) ఖండిస్తున్నాను. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని వారికి చెబుతున్నాను అని అసుదుద్దీన్ చెప్పారు. రాజాసింగ్ విచారణను పోలీసులు రికార్డు చేయాలి అని డిమాండ్ చేశారు.