World Cup: కళాకారుడి ప్రతిభ.. బియ్యపు గింజ పరిమాణంలో బంగారు ప్రపంచకప్ నమూనా
World Cup: ప్రపంచకప్‌పై తన అభిమానాన్ని చాటుకున్న కపిలవాయి గోపిచారి
World Cup: కళాకారుడి ప్రతిభ.. బియ్యపు గింజ పరిమాణంలో బంగారు ప్రపంచకప్ నమూనా
World Cup: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వరల్డ్ కప్ హవా నడుస్తోంది. దాంతో ఎవరికి తోచినట్టు వాళ్లు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ముఖ్యంగా భారత్ లో అయితే ప్రపంచకప్ గెలవాలని పూజించే భక్తులు ఎక్కువైపోయారు. ఇవన్నీ పక్కనపెడితే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ గెలవాలని ఓ స్వర్ణ కళాకారుడు బియ్యపు గింజ పరిమాణంలో బంగారు ప్రపంచకప్ తయారు చేసి అభిమానం చాటుకున్నాడు.
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రానికి చెందిన యువ స్వర్ణకారుడు కపిలవాయి గోపిచారి బియ్యపు గింజ పరిమాణంలో బంగారు ప్రపంచకప్ నమూనాను తయారు చేశారు. ప్రపంచకప్ 0.110 మిల్లీ గ్రాముల బంగారంతో, బ్యాట్ ,బాల్, పిచ్ వికెట్స్ ని 0.070 మిల్లీ గ్రాముల బంగారంతో , స్టేడియంని 0.660 బంగారముతో రెండురోజుల్లో తయారు చేసినట్లు చెప్పారు. గోపీచారి ప్రతిభను స్థానికులు ప్రశంసిస్తున్నారు. భారత్ కప్ అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.