Asia Cup 2025: మ్యాచ్ ఓడిపోతుందని తెలిసినా పాక్ అభిమాని చేసిన పనికి నెటిజన్లు ఫిదా! వీడియో వైరల్!
Viral Video: క్రికెట్ అంటేనే ఉద్వేగం, కానీ ఒక్కోసారి అందులో ఫన్నీ సంఘటనలు కూడా చోటుచేసుకుంటాయి.
Asia Cup 2025: మ్యాచ్ ఓడిపోతుందని తెలిసినా పాక్ అభిమాని చేసిన పనికి నెటిజన్లు ఫిదా! వీడియో వైరల్!
Viral Video: క్రికెట్ అంటేనే ఉద్వేగం, కానీ ఒక్కోసారి అందులో ఫన్నీ సంఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో అలాంటి ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌లో తమ జట్టు ఓటమి ఖాయమని గుర్తించిన ఒక పాకిస్థానీ అభిమాని చేసిన పనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మ్యాచ్ మధ్యలో పాక్ అభిమాని ఒకరు దిగులుగా, నిరాశతో పాక్ జెర్సీలో కనిపించారు. అయితే, కొద్దిసేపటికే అతను తన జెర్సీని మార్చుకున్నాడు. అంతేకాదు, పాక్ జెర్సీపైనే టీమిండియా జెర్సీని ధరించి సంతోషంతో చిందులేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు, మీమ్స్‌తో ఆ అభిమానిపై విపరీతంగా స్పందిస్తున్నారు.