Kavya Maran: ఎంత పని చేశావు కావ్య పాప..ఇప్పుడు చూడు ఏమైందో..!
Kavya Maran: పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ జట్టుకు ఊహించని షాక్. అభిమానుల భారీ నిరసనలతో ఆ జట్టు అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా సస్పెండ్ అయ్యింది.
Kavya Maran: ఎంత పని చేశావు కావ్య పాప..ఇప్పుడు చూడు ఏమైందో..!
Kavya Maran: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఒక్కసారిగా షాక్. అటు ఇంగ్లాండ్‌లో ఆటగాళ్ల వేలం జరుగుతుంటే, ఇటు సోషల్ మీడియాలో ఒక సంచలనం చోటుచేసుకుంది. పాకిస్థాన్ ఆటగాడిని కొనుగోలు చేసిన గంటల వ్యవధిలోనే సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా సస్పెండ్ అవ్వడం ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్ అయింది. అసలు ఏం జరిగింది? అభిమానులు ఎందుకు అంతలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఈ వివాదం వెనుక ఉన్న అసలు కథేంటి?
సంచలనం: 15 ఏళ్ల తర్వాత తొలిసారి
2008 ఐపీఎల్ తర్వాత భారత్-పాక్ సంబంధాల దృష్ట్యా ఐపీఎల్‌లో పాక్ ఆటగాళ్లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఏ భారత ఫ్రాంచైజీ కూడా పాక్ క్రికెటర్ల జోలికి వెళ్లలేదు. అయితే, ఇంగ్లాండ్‌లో జరుగుతున్న 'ది హండ్రెడ్' లీగ్‌లో సన్ గ్రూప్ 'సన్‌రైజర్స్ లీడ్స్' జట్టును కొనుగోలు చేసింది. గురువారం జరిగిన వేలంలో పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను రూ. 2.34 కోట్లకు కొనుగోలు చేసి సన్ గ్రూప్ చరిత్ర సృష్టించింది. ఒక భారత యాజమాన్యం పాక్ ప్లేయర్‌ను దక్కించుకోవడం గత 15 ఏళ్లలో ఇదే తొలిసారి.
కావ్యా మారన్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
వేలంలో సన్‌రైజర్స్ సీఈవో కావ్యా మారన్, కోచ్ డానియల్ వెట్టోరి స్వయంగా పాల్గొన్నారు. అబ్రార్ అహ్మద్ కోసం ట్రెంట్ రాకెట్స్ జట్టుతో గట్టిగా పోటీపడి మరీ అతడిని దక్కించుకున్నారు. అయితే, ఈ నిర్ణయం భారత అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. ముఖ్యంగా అబ్రార్ అహ్మద్ గతంలో 'ఆపరేషన్ సింధూర్' సమయంలో భారత్‌ను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడనే వార్త నెటిజన్లను మరింత ఆగ్రహానికి గురిచేసింది. దేశాన్ని అవమానించిన వ్యక్తిని కోట్లు పోసి ఎలా కొంటారంటూ కావ్యా మారన్‌ను, సన్ యాజమాన్యాన్ని నెటిజన్లు నిలదీశారు.
రిపోర్టుల వర్షం.. ఖాతా సస్పెన్షన్
అబ్రార్ కొనుగోలుపై నిరసనగా సన్‌రైజర్స్ లీడ్స్ ఎక్స్ ఖాతాను నెటిజన్లు టార్గెట్ చేశారు. నిన్నటి నుంచి వేలాది మంది అభిమానులు ఆ ఖాతాపై రిపోర్ట్ చేయడంతో, అనూహ్యంగా సన్‌రైజర్స్ లీడ్స్ ఖాతా సస్పెన్షన్‌కు గురైంది. సాధారణంగా కమ్యూనిటీ నిబంధనలు ఉల్లంఘించినా లేదా భారీ స్థాయిలో రిపోర్ట్స్ వచ్చినా ఎక్స్ యాజమాన్యం ఇలాంటి చర్యలు తీసుకుంటుంది. అయితే దీనిపై ఎక్స్ నుంచి గానీ, సన్ గ్రూప్ నుంచి గానీ ఇంకా అధికారిక వివరణ రాలేదు.
క్రీడలకు హద్దులు లేవని కొందరు అంటున్నా, దేశభక్తి విషయంలో మాత్రం అభిమానులు రాజీపడమని ఈ ఘటనతో తేల్చిచెప్పారు. భారత ఫ్రాంచైజీలు విదేశీ లీగ్‌లలో పెట్టుబడులు పెట్టినప్పుడు పాక్ ప్లేయర్ల విషయంలో ఆచితూచి అడుగువేయాలని ఈ వివాదం హెచ్చరిస్తోంది. సన్‌రైజర్స్ అకౌంట్ మళ్లీ పునరుద్ధరించబడుతుందా? లేక ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాలి.