Gautam Gambhir-Sandeep Patil: గంభీర్‌కు నేనంటే చాలా కోపం.. కనీసం కన్నెత్తి కూడా నన్ను చూడడు!
Gautam Gambhir-Sandeep Patil: భారత విజయాల్లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన మాజీ ఓపెనర్, ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ గురించి మాజీ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గంభీర్‌ను భారత జట్టు నుంచి తప్పించిన తర్వాత ఆయన ఇప్పటికీ తనతో మాట్లాడలేదని వెల్లడించారు.
Gautam Gambhir-Sandeep Patil: గంభీర్‌కు నేనంటే చాలా కోపం.. కనీసం కన్నెత్తి కూడా నన్ను చూడడు!
Gautam Gambhir-Sandeep Patil: భారత విజయాల్లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన మాజీ ఓపెనర్, ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ గురించి మాజీ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గంభీర్‌ను భారత జట్టు నుంచి తప్పించిన తర్వాత ఆయన ఇప్పటికీ తనతో మాట్లాడలేదని వెల్లడించారు. ఇద్దరూ ఎన్నో కార్యక్రమాల్లో ఒకే వేదికపై ఉన్నప్పటికీ.. గంభీర్ తనను చూడటానికే కూడా ప్రయత్నించలేదని తెలిపారు. తనను జట్టు నుంచి తప్పించానని గౌతీ తనపై ఇప్పటికీ గుర్రుగా ఉన్నాడని సందీప్ చెప్పారు. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ సందీప్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గౌతమ్ గంభీర్ 2006 నుంచి 2012 వరకు భారత జట్టుకు కీలక ఆటగాడిగా ఉన్నాడు. ముఖ్యంగా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో అతని పాత్ర ఎంతో కీలకం. అయితే 2013లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ తర్వాత సెలెక్టర్లు అతన్ని జట్టు నుంచి తప్పించారు. ఆ సమయంలో అతని ఫామ్ మోస్తరుగా ఉన్నా.. జట్టులో మార్పులు అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత గంభీర్ మళ్లీ వన్డే, టీ20 ఫార్మాట్‌లో భారత జట్టుకు తిరిగి ఆడలేదు. సందీప్ పాటిల్ మాట్లాడుతూ.. 'సెలెక్షన్ కమిటీ బాధ్యతలు చాలా కఠినమైనవి. జట్టుకు మంచిది ఏదో అనేదే ఆలోచించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. నా కాలంలో సచిన్, యువరాజ్, సెహ్వాగ్, లక్ష్మణ్ వంటి ప్రముఖ ఆటగాళ్ల విషయంలో కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. అయితే వారందరూ ఇప్పటికీ నాతొ స్నేహపూర్వకంగా మాట్లాడుతారు' అని చెప్పారు.
'గంభీర్ మాత్రం ఇప్పటికీ ఆ నిర్ణయాన్ని మర్చిపోలేదు. మేమిద్దరం చాలా కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నాం. ఒకే గదిలో కూర్చున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ గంభీర్ నాతో మాట్లాడలేదు, కనీసం నా వైపు చూడలేదు కూడా. నేను పలకరించినా స్పందించలేదు. అయినప్పటికీ అతడిని నేను గౌరవిస్తాను. ఒక ఆటగాడిగా జట్టులోంచి తప్పించబడటం చాలా కష్టమైన విషయం' అని సందీప్ పాటిల్ చెప్పారు. గంభీర్ జట్టులోంచి తప్పించబడిన తర్వాత అతని స్థానంలో శిఖర్ ధావన్‌కు అవకాశం వచ్చింది. ఆస్ట్రేలియాతో మొహాలీలో జరిగిన టెస్టులో ధవన్ 187 పరుగులతో అద్భుతమైన అరంగేట్రం చేసి జట్టులో స్థానం సంపాదించాడు. తర్వాత రోహిత్ శర్మతో కలిసి భారత జట్టుకు విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా మారాడు.
భారత జట్టుకు దూరమైనా గౌతమ్ గంభీర్.. ఐపీఎల్‌లో కేకేఆర్ తరఫున ఆడాడు. ఆ ప్రాంచైజీకి రెండు టైటిల్స్ కూడా అందించాడు. ఆ తరువాత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కూడా ఆడుతూ 2018లో అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే జట్టు నుంచి తప్పించబడిన ఆ సంఘటన ఇప్పటికీ గంభీర్ మనసులో మిగిలిపోయిందని సందీప్ పాటిల్ వ్యాఖ్యానించారు. జీటీ, కేకేఆర్ ప్రాంచైజీలకు మెంటర్‌గా చేశాడు. రాహుల్ ద్రవిడ్ 2024లో కోచ్ పదవి నుంచి తప్పుకున్నాక.. గౌతీ బాధ్యతలు అందుకున్నాడు. ఇప్పటికే గౌతీ టీమిండియాకు ఛాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 ప్రపంచ కప్ 2026 అందించాడు.