Rohit Sharma-IPL 2026: అభిమానులకు షాక్.. ఐపీఎల్‌కు రోహిత్ శర్మ గుడ్‌బై చెప్పనున్నాడా?
Rohit Sharma-IPL 2026: రోహిత్ శర్మ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చిన రోహిత్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కెరీర్‌కు త్వరలో ముగింపు పలకనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
Rohit Sharma-IPL 2026: అభిమానులకు షాక్.. ఐపీఎల్‌కు రోహిత్ శర్మ గుడ్‌బై చెప్పనున్నాడా?
Rohit Sharma-IL 2026: భారత జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చిన రోహిత్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కెరీర్‌కు త్వరలో ముగింపు పలకనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 2026 సీజన్ ముగిసిన తర్వాత ఫ్రాంచైజీ క్రికెట్‌కు హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో రోహిత్ బ్యాటింగ్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉన్న విషయం తెలిసిందే.
ఐపీఎల్‌లో రోహిత్ శర్మ కొన్నేళ్లుగా ముంబై ఇండియన్స్ ప్రాంచైజీకి ఆడుతున్న విషయం తెలిసిందే. ముంబై టీమ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జట్టును కొత్తగా నిర్మించాలనే ఆలోచనలో మేనేజ్‌మెంట్ ఉందని సమాచారం. రోహిత్ ఫిట్‌నెస్, ఫీల్డింగ్ అంశాలపై కూడా జట్టు యాజమాన్యం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్‌ను రాబోయే సీజన్ తర్వాత విడుదల చేసే అవకాశాన్ని కూడా ముంబై పరిశీలించిందని నివేదికలు సూచిస్తున్నాయి.
రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ మరో ఆప్షన్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఐపీఎల్ 2027కి ముందు విడుదల చేస్తే.. వేలంలో మరో జట్టు అతడిని తీసుకునే అవకాశం ఉండొచ్చని ముంబై యాజమాన్యం సూచించిందట. మరో టీమ్ కొనుగోలు చేస్తే ఐపీఎల్‌లో మరికొన్ని సీజన్లు హిట్‌మ్యాన్ ఆడే అవకాశం ఉండేది. కానీ రోహిత్‌కు మాత్రం ఇతర ఫ్రాంచైజీల తరఫున ఆడే ఆలోచన చేయలేదని తెలుస్తోంది. మరో జట్టులో ఆడడం కంటే ఈ సీజన్‌తోనే తన ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. హిట్‌మ్యాన్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ గొప్ప విజయాలను సాధించింది. ఏకంగా ఐదు ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకుంది. రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్య ముంబై జట్టును నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక రోహిత్ నిజంగానే 2026 సీజన్ తర్వాత ఐపీఎల్‌కు వీడ్కోలు చెబితే.. అది అభిమానులకు పెద్ద షాక్ అనే చెప్పాలి.