Arshdeep Singh-ICC: ఐసీసీ కోడ్ ఉల్లంఘన.. అర్ష్‌దీప్ సింగ్‌కు ఐసీసీ భారీ షాక్!
Arshdeep Singh-ICC: టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఐసీసీ కోడ్ ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు. జరిమానాతో పాటు అర్ష్‌దీప్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధించింది.
Arshdeep Singh-ICC: ఐసీసీ కోడ్ ఉల్లంఘన.. అర్ష్‌దీప్ సింగ్‌కు ఐసీసీ భారీ షాక్!
టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకుంది. 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్-1 నిబంధనలను ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు. జరిమానాతో పాటు అర్ష్‌దీప్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధించింది. ఫైనల్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్‌పై అనుచితంగా బంతి విసిరినందుకు అర్ష్‌దీప్‌కు ఐసీసీ జరిమానా వేసింది.
Arshdeep Singh-ICC: అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ సమయంలో అర్ష్‌దీప్ సింగ్ ఆవేశానికి గురయ్యాడు. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్ వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. దీంతో అర్ష్‌దీప్ అసహనంకు గురయ్యాడు. 11వ ఓవర్లో మరో బంతిని మిచెల్ షాట్ ఆడగా.. బంతి అర్ష్‌దీప్ చేతుల్లోకి వచ్చింది. బంతిని అందుకున్న అర్ష్‌దీప్.. మిచెల్‌పై నేరుగా విసిరాడు. దీంతో మిచెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయాడు. ఏంటిది? అన్నట్లుగా అర్ష్‌దీప్ వైపు దూసుకొచ్ఛాడు. అర్ష్‌దీప్ మాత్రం అదేమీ ఏమీ పట్టించుకోకుండా మరో బంతి వేసేందుకు వెళ్లిపోయాడు. మిచెల్ వద్దకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెళ్లి సర్ది చెప్పాడు. మరోవైపు అర్ష్‌దీప్‌కు అంపైర్ వార్నింగ్ ఇవ్వడంతో.. సారీ అన్నట్లుగా సైగలు చేశాడు.
అర్ష్‌దీప్ సింగ్ చర్యను ఐసీసీ అనుచితంగా, ప్రమాదకరంగా పరిగణించింది. ఈ ఘటన ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.9 కిందకు వస్తుంది. అంతర్జాతీయ మ్యాచ్ సమయంలో ఆటగాడిపై బంతి లేదా ఇతర క్రికెట్ పరికరాలను ప్రమాదకరంగా విసరడం నిబంధనలకు విరుద్ధమని ఐసీసీ పేర్కొంది. జరిమానాతో పాటు అర్ష్‌దీప్ డిసిప్లినరీ రికార్డులో ఒక డిమెరిట్ పాయింట్ కూడా జతచేసింది. గత 24 నెలల కాలంలో ఇది అతని తొలి తప్పిదం కావడం గమనార్హం. ఈ ఘటనపై ఆన్‌ఫీల్డ్ అంపైర్లు రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అలెక్స్ వార్ఫ్.. థర్డ్ అంపైర్ అల్లాహుద్దీన్ పాలేకర్, ఫోర్త్ అంపైర్ అడ్రియన్ హోల్డ్‌స్టాక్ ఆరోపణలు మోపారు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ సూచించిన శిక్షను అర్ష్‌దీప్ అంగీకరించడంతో.. దీనిపై అధికారిక విచారణ అవసరం లేకుండానే విషయం ముగిసింది. ఆ ఓవర్ అనంతరం మిచెల్ వద్దకు వెళ్లిన అర్ష్‌దీప్ సారీ చెప్పాడు. తాను మిచెల్‌కు సారీ చెప్పానని, కావాలని బంతిని అలా విసరలేదని మ్యాచ్ అనంతరం అర్ష్‌దీప్ తెలిపాడు.