T20 World Cup 2026: గత తొమ్మిది టీ20 వరల్డ్‌కప్‌లలో సాధ్యం కాని రికార్డు.. ఈసారి ఇద్దరు భారత బౌలర్లు నెలకొల్పారు!

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ ఓ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఇద్దరు భారత బౌలర్లు వరుణ్-బుమ్రా నిలిచారు. వీరిద్దరూ చెరో14 వికెట్లు పడగొట్టారు

Update: 2026-03-09 12:59 GMT

T20 World Cup 2026

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో జట్టును చాంపియన్స్‌గా నిలిపారు. ముఖ్యంగా స్పిన్–పేస్ జంటగా నిలిచిన జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిలు జట్టుకు కీలక విజయాలు అందించారు. మెగా టోర్నీలో వికెట్లు పడగొట్టిన ఈ ఇద్దరు బౌలర్లు.. గత తొమ్మిది టీ20 వరల్డ్‌కప్‌లలో ఏ భారత బౌల‌ర్‌కు సాధ్యం కాని రికార్డును సాధించారు. టీ20 ప్రపంచ కప్ ఓ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో నిలిచారు. చెరో 14 వికెట్లు పడగొట్టి మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో వరుణ్-బుమ్రా నిలిచారు.

టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒక్కో ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో పలువురు దిగ్గజాలు ఉన్నారు. టీ20 ప్రపంచ కప్ 2007 ఎడిషన్‌లలో పాకిస్థాన్ మాజీ పేసర్ ఉమర్ గుల్ టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అతడు 13 వికెట్లు తీశాడు. 2009 ఎడిషన్‌లో కూడా గుల్ 13 వికెట్లతో అగ్ర స్థానం సంపాదించాడు. 2010లో డిర్క్ నాన్స్ 14 వికెట్లు పడగొట్టాడు. 2012లో శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ 15 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు.

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2014లో అహ్సన్ మాలిక్ 12 వికెట్లు తీసి టాప్‌లో నిలిచాడు. 2016లో మహమ్మద్ నబీ కూడా 12 వికెట్లతో మెప్పించాడు. 2021, 2022 ఎడిషన్‌లలో శ్రీలంక స్పిన్నర్ వానిందు హాసరంగ వరుసగా 16, 21 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఇపటివరకు మరే బౌలర్ కూడా ఓ ఎడిషన్‌లో 21 వికెట్స్ పడగొట్టలేదు. 2024లో ఫజల్హాక్ ఫారూఖీ 17 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. ఇక 2026 ఎడిషన్‌లో మాత్రం భారత జట్టు ఇద్దరు బౌలర్లు టాప్ వికెట్ టేకర్‌లుగా నిలిచారు. వరుణ్ చక్రవర్తి తన మిస్టరీ స్పిన్‌తో బ్యాటర్లను బోల్తాకొట్టించగా.. జస్ప్రీత్ బుమ్రా తన యార్కర్లు, స్లో బంతులతో ప్రత్యర్థులను కట్టడి చేశాడు.

టాప్ వికెట్ టేకర్‌ల లిస్ట్:

2007 - ఉమర్ గుల్ (13)

2009 - ఉమర్ గుల్ (13)

2010 - డిర్క్ నాన్స్ (14)

2012 - అజంతా మెండిస్ (15)

2014 - అహ్సన్ మాలిక్ (12)

2016 - మహ్మద్ నబీ (12)

2021 - వనిందు హసరంగా (16)

2022 - వనిందు హసరంగా (21)

2024 - ఫజల్హాక్ ఫరూఖీ (17)

2026 - వరుణ్ చక్రవర్తి / జస్ప్రీత్ బుమ్రా (14)

Tags:    

Similar News