T20 World Cup 2026 Winner: విశ్వవిజేత టీమిండియాకు ప్రధాని మోడీ అభినందనలు

T20 World Cup 2026 Winner: న్యూజిలాండ్ పై అద్భుత విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియాను ప్రధాని మోడీ ప్రశంసించారు

Update: 2026-03-09 05:34 GMT

T20 World Cup 2026 Winner

T20 World Cup 2026 Winner: T20 ప్రపంచ కప్ గెలిచినందుకు భారత జట్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందించారు . అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన T20 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడ్డాయి.

టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా తరఫున సంజు సామ్సన్ 89 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 52 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 54 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మూడు హాఫ్ సెంచరీల సహాయంతో, టీం ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది.

దీంతో 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిఆన్ న్యూజిలాండ్ జట్టు 72 పరుగులేకె 5 వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత న్యూజిలాండ్ కొంత కోలుకునేట్టు కనిపించినా జస్ప్రీత్ బుమ్రా ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. మొత్తంమీద టీమ్ ఇండియా బౌలర్లు న్యూజిలాండ్ జట్టును 19 ఓవర్లలో 159 పరుగులకే పరిమితం చేసి వారిని ఆలౌట్ చేశారు. దీని ద్వారా, టీమ్ ఇండియా 96 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

ఈ అద్భుతమైన విజయంపై భారత జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. టీం ఇండియా ప్రదర్శనను ప్రశంసించారు.

“ఛాంపియన్లు! ఐసిసి పురుషుల టి 20 ప్రపంచ కప్ గెలిచినందుకు టీం ఇండియాకు అభినందనలు! ఈ అద్భుతమైన విజయం అసాధారణ నైపుణ్యం, దృఢ సంకల్పం, జట్టుకృషిని ప్రతిబింబిస్తుంది. టోర్నమెంట్ అంతటా టీం ఇండియా గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించింది. ఈ విజయం ప్రతి భారతీయుడిని సంతోషపెట్టింది. గర్వపడేలా చేసింది. అభినందనలు, టీం ఇండియా!” అంటూ ప్రధాన మంత్రి మోడీ తన సోషల్ మీడియా ఖాతాలో రాశారు.

ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా టీమ్ ఇండియాను అభినందించారు. టోర్నమెంట్ అంతటా వారి అద్భుతమైన ప్రదర్శనలకు సంజు సామ్సన్, జస్ప్రీత్ బుమ్రాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. "అద్భుతమైన విజయంతో స్వదేశంలో ట్రోఫీని నిలబెట్టుకున్నందుకు , మాకు మరో మరపురాని క్షణాన్ని ఇచ్చినందుకు టీమ్ ఇండియాకు అభినందనలు" అని ఆయన సోషల్ మీడియాలో రాశారు.



Tags:    

Similar News